Best Inverter ACs : ప్రతినెలా కరెంట్ బిల్లును తగ్గించే.. రూ.35వేల లోపు బెస్ట్ ఇన్వెర్టర్ ఏసీలు ఇవే..
Best Inverter Air Conditioners : అసలే సమ్మర్.. ఉక్కపోత.. ఇంట్లో ఏసీ లేకుంటే అంతే సంగతలు.. సమ్మర్ సీజన్ కావడంతో చాలామంది తమ ఇంట్లోనే ఏసీలను 24 గంటలు ఆన్ చేసే ఉంచుతున్నారు.
ఉక్కపోత నుంచి ఉపశమనం కలిగిందిలే అనుకుంటే.. ఏసీ కంటిన్యూగా రన్ కావడంతో నెలవారీ కరెంట్ బిల్లు తడిసి మోపడు అవుతుంది. ఏసీలతో భారీగా కరెంట్ బిల్లు రావడంతో చెల్లించలేక లబోదిబోమంటుంటారు. ఏసీలు ఎక్కువగా వినియోగించే వారికి కరెంట్ బిల్లు ఎక్కువగా వస్తుంది. అందుకే సాధారణ ఏసీలకు బదులుగా ఇన్వర్టర్ ఎయిర్ కండీషనర్లు వాడుకోవడం చాలా మంచిది.
సమ్మర్ సీజన్‌లో ఈ ఇన్వెర్టర్ ఏసీలు కీలక పాత్ర పోషిస్తాయి. సాధారణ ACలతో పోల్చినప్పుడు.. ఇన్వర్టర్ ఎయిర్ కండీషనర్లు సమర్థవంతంగా పనిచేస్తాయి. ఇన్వర్టర్ ACలు వేరియబుల్ స్పీడ్ కంప్రెసర్ కారణంగా.. తక్కువ శక్తిని వినియోగిస్తాయి. నెలాఖరులో విద్యుత్ బిల్లును చాలా తక్కువగా వస్తుంది కూడా. ఇన్వర్టర్ ఎయిర్ కండీషనర్లతో అదనపు ప్రయోజనం ఏమిటంటే.. సాధారణ విండో ACల మాదిరిగా కాకుండా.. ఆపరేషన్‌లో చాలా నిశ్శబ్దంగా ఉంటాయి. ఎలాంటి సౌండ్ వినిపించదు. అందుకే ఇలాంటి ఏసీలను ఎంచుకోవడమే మేలు.. రూ. 35వేల లోపు ఏయే బ్రాండ్ల ఇన్వెర్టర్ ఏసీలు అందుబాటులో ఉన్నాయో ఓసారి చూద్దాం..
Best inverter ACs under Rs 35,000 :
Voltas Magnum 1 Ton 3 Star Inverter Split AC :
ఈ ఏసీ ధర రూ. 31,990. ఎయిర్ కండీషనర్‌లో BLDC రోటరీ కంప్రెసర్ కలిగి ఉంది. అలాగే 3440 వాట్ల శీతలీకరణ సామర్థ్యం, కాపర్ కండెన్సర్ ఉన్నాయి. దీనికి 3 స్టార్ ఇచ్చారు. ఈ AC సుమారుగా 130 చదరపు అడుగుల కవరేజీని అందిస్తుంది. 12 నెలల వారంటీతో పాటు 10 ఏళ్ల కంప్రెసర్ వారంటీతో వచ్చింది.
Best Inverter Air Conditioners, Best Inverter Acs, Best Air Conditioners, Reduce Electricity Bill
Lloyd 1.25 Ton 3 Star Inverter Split AC ధర రూ. 32,990గా ఉంది. ఎయిర్ కండీషనర్‌లో రోటరీ కంప్రెసర్, కూలింగ్ కెపాసిటీ 4410 వాట్స్ కాపర్ కండెన్సర్ ఉన్నాయి. 3 స్టార్ AC సుమారుగా 150 చదరపు అడుగుల కవరేజీని అందిస్తుంది. 12 నెలల వారంటీతో పాటు 10ఏళ్ల కంప్రెసర్ వారంటీతో వచ్చింది.
Haier CleanCool 1 Ton 3 Star Inverter Split AC
Haier CleanCool 1 Ton 3 Star Inverter Split AC ధర రూ. 31390గా ఉంది. ఎయిర్ కండీషనర్‌లో డ్యూయల్ రోటరీ కంప్రెసర్, 3600 వాట్ల కూలింగ్ కెపాసిటీ కాపర్ కండెన్సర్ ఉన్నాయి. 3 స్టార్ AC సుమారుగా 130 చదరపు అడుగుల కవరేజీని అందిస్తుంది. 12 నెలల వారంటీతో పాటు 10 ఏళ్ల కంప్రెసర్ వారంటీతో వచ్చింది.
Croma 1.5 Ton 3 Star Inverter Split AC :
క్రోమా 1.5 టన్ను 3 స్టార్ ఇన్వర్టర్ స్ప్లిట్ AC ధర రూ. 31990గా ఉంది. ఎయిర్ కండీషనర్‌లో సింగిల్ రోటరీ ఇన్వర్టర్ కంప్రెసర్, 5250 వాట్ల కూలింగ్ కెపాసిటీ కాపర్ కండెన్సర్ ఉన్నాయి. 3 స్టార్ AC సుమారుగా 180 చదరపు అడుగుల కవరేజీని అందిస్తుంది. 12 నెలల వారంటీతో పాటు 10ఏళ్ల కంప్రెసర్ వారంటీతో అందుబాటులో ఉంది.
Panasonic 1 Ton 3 Star Inverter Split AC :
పానాసోనిక్ 1 టన్ 3 స్టార్ ఇన్వర్టర్ స్ప్లిట్ AC ధర రూ. 35990గా ఉంది. ఎయిర్ కండీషనర్‌లో రోటరీ కంప్రెసర్, 3500 వాట్ల కూలింగ్ కెపాసిటీ కాపర్ కండెన్సర్ ఉన్నాయి. 3 స్టార్ AC సుమారుగా 130 చదరపు అడుగుల కవరేజీని అందిస్తుంది. 12 నెలల వారంటీతో అందుబాటులో ఉంది.
0 Comments:
Post a Comment