Belly Fat Reduction Tips: ఈ చిట్కాతో కేవలం ఒక్క నెలలోనే బెల్లీ ఫ్యాట్ ను తగ్గించుకోవచ్చు!
Belly Fat Reduction Tips: మారుతున్న వాతావరణం, ఆహారపు అలవాట్ల కారణంగా మన శరీరంలో విపరీతమైన మార్పులు జరుగుతున్నాయి. ఈ కాలంలో చాలా మంది స్థూలకాయం, అధిక బరువుతో బాధపడుతున్నారు.
అలా బరువును తగ్గించుకునేందుకు చాలా మందికి వ్యాయామం చేసేందుకు కూడా తగిన సమయం లభించడం లేదు. ఈ క్రమంలో కేవలం ఓ ఇంటి చిట్కాను పాటించడం వల్ల బరువు తగ్గడానికి అవకాశం ఉంది. ఇలా చేయడం వల్ల కేవలం నెల రోజుల్లోనే బరువు తగ్గేందుకు అవకాశం ఉంది.
బెల్లీ ఫ్యాట్ ను తగ్గించుకోవడం ఎలా?
బెల్లీ ఫ్యాట్ ను తగ్గించుకునేందుకు అనేక మార్గాలు ఉన్నాయి. ఇంట్లో ఉండే వాము నీటితో బెల్లీ ఫ్యాట్ ను ఈజీగా తగ్గించుకోవచ్చు. వామును రాత్రంతా నీటిలో నానబెట్టి.. ఉదయం నిద్ర లేచిన తర్వాత ఆ నీటిని తాగడం వల్ల నడుము చుట్టు ఏర్పడిన బెల్లీ ఫ్యాట్ తగ్గుతుంది. వాము నీటితో థైమోల్ కొవ్వును తగ్గించడంలో సహాయపడుతుంది.
మెరుగైన జీర్ణక్రియ కోసం..
వాము తినడం వల్ల జీర్ణక్రియ మెరుగ్గా జరుగుతుంది. వాము నీటిని రోజూ తాగడం వల్ల పొట్టలో ఎసిడిడీ సమస్య పోతుంది. వాము నీటిలో అయోడిన్, ఫాస్పరస్, కాల్షియం, పొటాషియం వంటి పోషకాలను కూడా అధిక మొత్తంలో కలిగిఉంది.
0 Comments:
Post a Comment