దిశ, వెబ్‌డెస్క్ : ప్రస్తుతం టెక్నాలజీ మారిపోయింది. చేతిలో, పర్స్‌లో డబ్బులు పెట్టుకునే రోజులు పోయి, ఫొన్తోనే అన్ని లావాదేవీలు నడిపిస్తున్నారు.
ఎవరిదగ్గర చూసిన ఫోన్ పే, గూగుల్ పేనే తప్ప వేరే ఆప్షన్ లేకుండా పోయింది. అయితే కొంత మందికి అత్యవసరంగా డబ్బు అవసరం ఉన్న సమయంలో ఏటీఎంకు వెళ్లాల్సి వస్తుంది కానీ చాలా మంది కార్డ్, లేదా ATM పిన్ మర్చిపోతు ఉంటారు.
ఇక అలాంటి వారికి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ గుడ్ న్యూస్ తెలిపింది. మారిన టెక్నాలజీకి అనుగుణంగా ఏటీంలో మార్పు చేయనున్నారు. ఇక పై నుంచి డబ్బులు డ్రా చేయడానికి వెళ్తే చేతిలో కార్డు ఉండకపోయినా పర్వాలేదంటున్నారు. ఎందుకంటే ?
ఎటీఎం మెషిన్ వద్దకు వెళ్లి స్మార్ట్ ఫొన్తో డబ్బులు డ్రా చేసుకునే సౌకర్యం కల్పిస్తున్నారు. యూపీఐ ఆప్షన్ ద్వారా ఈ అవకాశం అందుబాటులోకి రానుంది. యూపీఐ సర్వీస్‌ను సపోర్టు చేస్తున్న ప్రతి ATMలో ఇది అందుబాటులో ఉంటుంది.
ముందుగా ATM వద్దకు వెళ్లి స్క్రీన్ పై యూపీఐ ఆప్షన్ సెలక్ట్ చేసుకోవాలి. అక్కడ ఒక క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది. యూపీఐ యాప్ ద్వారా ATM స్క్రీన్ పై ఉన్న కోడ్ ను స్కాన్ చేయాలి.
అనంతరం ఎంత డబ్బుకావాలనే ఆప్షన్ వస్తుంది. అందులో మనకు కావాల్సిన అమౌంట్ ఎంటర్ చేసి ATM పిన్ ఎంటర్ చేయాలి దీంతో లావాదేవీ ప్రాసెస్ ఫినిష్ అవుతుంది.
అయితే దీనికి గరిష్ట పరిమితి అనేది ఉంటుంది. దాని బట్టి మనం డబ్బులు విత్ డ్రా చేసుకోవాలి.
0 Comments:
Post a Comment