🌼అమ్మ ఒడి మార్గదర్శకాలు
✳️జగనన్న అమ్మఒడి మార్గద ర్శకాలు తాజాగా విడుదలయ్యాయి .
❇️ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్పీసీఐ ( నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ) లింక్ అయిన బ్యాంకు అకౌంట్లో మాత్రమే అమ్మ ఒడి నగదు జమ అవుతుంది . ఎస్పీసీఐ లింకు అయిన బ్యాంకు ఖాతా వివరాలు స్కూల్ లాగిన్ ఎన్రోల్ చేయాలి . ఇది ' అమ్మ ఒడికే కాదు . ప్రభుత్వం నుంచి రావాల్సిన ఏ నగదు అయినా ఎన్పీసీఐకి లింక్ అయిన ఖాతాకే జమ అవుతుంది . •
ఎన్పీసీఐ లింక్ చేయడం అంటే బ్యాంకు అకౌంట్ ఆధార్ లింక్ చేసి ఉండటమే . ఒక వ్యక్తికి మూడు లేదా నాలుగు బ్యాంకు అకౌం ట్లు ఉంటే ఒక బ్యాంకు అకౌంట్ మాత్రమే ఎన్పీసీఐకి లింక్ అయి ఉంటుంది .
విద్యార్థి తల్లి , సంరక్షకుని బ్యాంకు అకౌంట్ ఇచ్చిన వారి కుటుంబంలో సంబంధిత విద్యా ర్ధి నమోదై ఉండవలెను . లేనిచో వలంటీర్ ద్వారా ఈ - కేవైసీ చేయించుకోవాలి .
• ప్రతి విద్యార్థి తల్లి బ్యాంక్లో ఎన్పీసీఐ లిం క్ , వలంటీర్ ద్వారా ఈ - కేవైసీ తప్పనిసరిగా చేయించుకోవాలి .
*ఖాతా మార్పునకు అవకాశం ..
❇️గ్రామీణ వాసులకు మేలు జరిగేలా ప్రభుత్వం బ్యాంకు ఖాతాలను మార్పు చేసుకునేందుకు వెసులుబాటు కల్పించింది . ఉపాధి కూలీలకు పోస్టాఫీసుల్లో ఇప్పటికే ఖాతాలు ఉన్నాయి . అమ్మ ఒడి పథకానికి పోస్టాఫీసు ఖాతాలకు గుర్తింపు ఇవ్వడంతో , వీటిని అనుసంధానం చేసేలా విద్యాశాఖాధికారులు పాఠశాల ప్రధా నోపాధ్యాయులకు ఆదేశాలు జారీ చేశారు . అంగన్వాడీ కార్యకర్తల పిల్లలకు కూడా అమ్మ ఒడి పథకం వర్తింపజేస్తున్నారు.
0 Comments:
Post a Comment