Aadhaar Update: ఇక ఆధార్ సెంటర్‌కు వెళ్లాల్సిన అవసరం లేదు... ఈ సేవలన్నీ ఆన్లైన్లోనే
ఆధార్ కార్డ్ హోల్డర్లకు యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) ఓ గుడ్ న్యూస్ చెప్పింది.
మరిన్ని సేవల్ని ఆన్‌లైన్‌లోకి తీసుకొచ్చింది. ఆధార్ కార్డ్ హోల్డర్లు ఇక ప్రతీ సర్వీస్ కోసం ఆధార్ సేవా కేంద్రానికో (Aadhaar Seva Kendra), ఆధార్ సెంటర్‌కో వెళ్లాల్సిన అవసరం లేదు. అక్కడ గంటల తరబడి క్యూలో ఉండాల్సిన అవసరం కూడా లేదు. ఇంట్లో కూర్చొనే ఆన్లైన్లో కొన్ని సేవల్ని పొందొచ్చు. డెమోగ్రఫిక్ డీటెయిల్స్ అంటే పేరు, జెండర్, పుట్టిన తేదీ, అడ్రస్ లాంటి వివరాలను ఆన్లైన్లోనే పొందొచ్చని యూఐడీఏఐ ట్వీట్ చేసింది. ఎంఆధార్ యాప్‌లో (mAadhaar App) వీటిని మార్చుకోవచ్చని తెలిపింది.
ఆధార్ కార్డ్ హోల్డర్లు పేరును రెండుసార్లు మార్చుకోవచ్చు. అయితే చిన్న మార్పుల్నే అనుమతిస్తారు. జెండర్‌ను ఒకసారి మార్చుకోవచ్చు. పుట్టినతేదీని కూడా ఓసారి మార్చుకోవచ్చు. అడ్రస్ ఎన్నిసార్లైనా మార్చవచ్చు. ప్రతీ రిక్వెస్ట్‌కు రూ.50 చొప్పున ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. ఒకేసారి ఒకటి కన్నా ఎక్కువ వివరాలను కూడా అప్డేట్ చేయడం సాధ్యం.
మరి ఎంఆధార్ యాప్‌లో పేరు, జెండర్, పుట్టిన తేదీ, అడ్రస్ ఎలా మార్చాలో తెలుసుకోండి.
Step 1- ముందుగా మీ స్మార్ట్‌ఫోన్‌లో ఎంఆధార్ యాప్ డౌన్లోడ్ చేయాలి.
Step 2- మీ మొబైల్ నెంబర్‌తో రిజిస్ట్రేషన్ చేయాలి.
Step 3- Aadhaar Update పైన క్లిక్ చేయాలి.
Step 4- మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి.
Step 5- మీ రిజిస్ట్రేషన్ మొబైల్ నెంబర్‌కు వచ్చే ఓటీపీని ఎంటర్ చేయాలి.
Step 6- పేరు, జెండర్, పుట్టిన తేదీ, అడ్రస్ ఆప్షన్స్‌లో ఉంటాయి.
Step 7- మీరు మార్చాలనుకుంటున్న వివరాలకు సంబంధించిన ఆప్షన్ సెలెక్ట్ చేయాలి.
Step 8- ఆ తర్వాత మార్చాలనుకున్న వివరాలు ఎంటర్ చేయాలి.
Step 9- అవసరమైన డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి.
Step 10- ఆ తర్వాత మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు వచ్చే ఓటీపీని ఎంటర్ చేయాలి.
Step 11- రూ.50 ఛార్జీలు చెల్లించాలి.
Step 12- క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, మొబైల్ వ్యాలెట్, యూపీఐ ద్వారా పేమెంట్ చేయొచ్చు.
ఎంఆధార్ యాప్ గూగుల్ ప్లేస్టోర్, యాపిల్ యాప్ స్టోర్‌లో అందుబాటులో ఉంది. మీరు ఇప్పటికే ఈ యాప్ ఉపయోగిస్తున్నట్టైతే లేటెస్ట్ వర్షన్ ఇన్స్టాల్ చేయాలని యూఐడీఏఐ కోరుతోంది. ఎంఆధార్ యాప్‌లో 35 రకాల ఆధార్ సేవలు పొందొచ్చు. ఎంఆధార్ యాప్ 13 భాషల్లో ఉపయోగించొచ్చు. ఈ యాప్‌లో మీ కుటుంబ సభ్యుల ప్రొఫైల్స్ కూడా యాడ్ చేయొచ్చు. ఒక యాప్‌లో ఐదుగురి ప్రొఫైల్స్ యాడ్ చేయొచ్చు. ఆధార్ కార్డ్ డౌన్లోడ్, ఆధార్ పీవీసీ కార్డ్ ఆర్డర్, ఆధార్ బయోమెట్రిక్స్ లాక్, అన్‌లాక్, ఆధార్ అప్డేట్ స్టేటస్ లాంటి అనేక సేవల్ని పొందొచ్చు.
0 Comments:
Post a Comment