✍️50 ప్రభుత్వ కళాశాలల లో నాలుగేళ్ల బీఈడీ
🌻ఈనాడు,న్యూస్: జాతీయ ఉపాధ్యాయ విద్యామండలి(ఎన్‌సీటీఈ) దేశవ్యాప్తంగా 50 కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విద్యాసంస్థల్లో నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్ బీఈడీని వచ్చే విద్యా సంవత్సరం(2022-23) నుంచి ప్రారంభించనుంది. ఇంజినీరింగ్, మెడికల్ తదితర వృత్తి విద్యాకోర్సుల మాదిరిగానే ఇంటర్ విద్యార్హతతోనే ఉపాధ్యాయ విద్యలోకి ప్రవేశించాలన్నది కేంద్ర ప్రభుత్వ ఉద్దేశం. డిగ్రీ పూర్తయ్యాక ఇక ఏదీ దొరకకపోతే బీఈడీలో చేరుతున్నారని, ఫలితంగా విద్యాబోధనకు నాణ్యమైన ఉపాధ్యాయుల కొరత వస్తోందని సర్కారు భావిస్తోంది. అందుకే 2030 తర్వాత రెండేళ్ల బీఈడీ ఉండరాదని, నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్ టీచర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్(ఐటీఈపీ) బీఈడీ కోర్సును దేశవ్యాప్తంగా ప్రవేశపెట్టాలని జాతీయ విద్యావిధానం-2020లో పేర్కొన్నారు. ఆ కోర్సును ప్రయోగాత్మకంగా 50 కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విద్యాసంస్థల్లో ప్రవేశపెట్టాలని కేంద్రం నిర్ణయించింది. అందుకోసం ఈనెల 31 వరకు గడువునిస్తూ ఎన్‌సీటీఈ ఆయా విద్యాసంస్థల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. తెలుగు రాష్ట్రాల నుంచి ఎన్ని విశ్వవిద్యాలయాలు ఈ కోర్సు ఆరంభించటానికి దరఖాస్తు చేస్తాయన్నది ఆసక్తికరంగా మారింది.
0 Comments:
Post a Comment