దిశ, వెబ్‌డెస్క్ః రాత్రి సమయంలో కరెంటు లేకుండా ఒక గంట ఉండాలంటేనే చాలా కష్టం. అలాంటిది, కనీసం సూర్యరశ్మి లేకుండా 4 నెలలు ఉండటమంటే ఒక్కసారి ఊహించుకోండి!
చాలా మందికి ఇది కష్టం మాత్రమే కాదు, 'నరకం' అంటే ఇలాగే ఉంటుందేమో అనుకుంటారు. అయితే, ఇది మన భూమి పైన ప్రతి ఏడాది జరిగే పరిణామమే. ఈ ఏడాది మే 13న అక్కడ చివరి సూర్యాస్తమయం అయ్యింది.
ఇప్పుడు అంటార్కిటికా 'లాంగ్ నైట్' పీరియడ్‌లోకి ప్రవేశించింది. వాస్తవానికి, ఇకపై ఈ ప్రాంతంలో ఉండే ఒంటరితనం, విపరీతమైన ఉష్ణోగ్రతలు చాలా మందికి భయాందోళన కలిగిస్తాయి. కానీ, దీన్నే ఒక ప్రత్యేక పరిశీలనలకు ఉపయోగిస్తారు శాస్త్రవేత్తలు.
సూర్యోదయం లేని ఈ 4 నెలల కాలంలో వ్యోమోగాములు తమ అంతరిక్ష యాత్రలకు సిద్ధం కావడానికి, కొన్ని కష్టతరమైన పరిస్థితులలో జీవించడానికి శిక్షణా కాలంగా ఉపయోగిస్తారు.
మనుషులతో సంబంధం లేకుండా, కనీస సూర్యరశ్మి తగలకుండా, కఠినమైన పరిస్థితులను ఎదుర్కోవడానికి ఇక్కడే కఠోర శిక్షణ పొందుతారు.
ప్రపంచంలో దాదాపు అన్ని ప్రదేశాలు ఏడాదికి నాలుగు ప్రధాన సీజన్లను అనుభవిస్తుంటే, అంటార్కిటికాలో మాత్రం వేసవి, శీతాకాలం అనే రెండు కాలాలు మాత్రమే ఉంటాయి.
భూమిలోని అత్యంత శీతల ఖండమైన అంటార్కిటికా ఆరు నెలలు సూర్యరశ్మిని అనుభవించి, సంవత్సరంలో మిగిలిన భాగం పూర్తిగా చీకటిలో ఉంటుంది.
ఇకపై ఇక్కడ ఉష్ణోగ్రతలు దాదాపు మైనస్ 80 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోవచ్చని అంచనా. ఇక, ఈ సమయంలో అంటార్కిటికాలోని రిమోట్ బేస్ అయిన కాంకోర్డియా ఈసారి యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ (ESA) నుండి 12 మంది సభ్యుల బృందానికి స్థావరం అయ్యింది.
వాళ్లు ఇక్కడ ఒంటరిగా నివసించి, కఠినమైన పరిస్థితులు మానవులను ఎలా ప్రభావితం చేస్తాయో అర్థం చేసుకోవడానికి వివిధ ప్రయోగాలు చేస్తారు.
"నిద్రపై అధ్యయనాల నుండి గట్ హెల్త్ కొలతలు, బిహేవియర్ మార్పులపై అభ్యాసం వరకు, తీవ్రమైన వాతావరణాల్లో సవాళ్లను అర్థం చేసుకోవడానికి, వాటిని అధిగమించడానికి సిబ్బందిని సిద్దం చేస్తారు.
0 Comments:
Post a Comment