✍️1, 6 తరగతులకే డిక్షనరీలు
♦మిగిలిన వాటికి గతేడాది ఇచ్చినవే..
♦జెవికె కిట్ల పంపిణీపై విద్యాశాఖ కసరత్తు
*🌻ప్రజాశక్తి-అమరావతి బ్యూరో*
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే 1. 6 తరగతుల విద్యార్థులకే వచ్చే విద్యా సంవత్సరం నుంచి డిక్షనరీలను పంపిణీ చేయనుంది. మిగిలిన తరగతులకు గతేడాది ఇచ్చిన వాటినే సరిపెడుతుంది. ప్రభుత్వ మున్సిపల్, గురుకుల, ఆశ్రమ, ఎయిడెడ్, మోడల్, కెజిబివి, రిజిస్టర్డ్ మదర్సాలలో చదువుతున్న విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం జగనన్న విద్యాకానుక జెవికె) కిట్లను రెండేళ్లుగా అందిస్తోంది. ఈ కిట్‌లో విద్యార్థులకు మూడు జతల దుస్తులు, స్కూల్ బ్యాగ్, బెల్ట్, బూట్లు, రెండు జతల సాక్సులు, పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్ పాటు ఆక్స్ఫర్డ్ డిక్షనరీలను పాఠశాల విద్యాశాఖ ద్వారా అందించింది. గతేడాది రూ.731.30 కోట్లతో సుమారు 48 లక్షల మంది విద్యార్థులకు ఈ కిట్లు అందించింది. వచ్చే విద్యాసంవత్సరం కూడా జెవికె కిట్లను అందించేందుకు పాఠశాల విద్యాశాఖ కసరత్తు మొదలుపెట్టింది. ఈ సరఫరా బాధ్యత అంతా సమగ్ర శిక్షా చూసుకుంటోంది. గతేడాది 1 నుంచి 5వ తరగతి విద్యార్థులకు పిక్టోరియల్ డిక్షనరీ, 6:నుంచి 10వ తరగతి విద్యార్థులకు ఆక్స్ఫర్డ్ డిక్షనరీలు సరఫరా చేసింది. వచ్చే విద్యా సంవత్సరం (2022-23) కేవలం 1వ తరగతి విద్యార్థులకు పిక్టోరియల్, 6వ తరగతి విద్యార్థులకు ఆక్స్ఫర్డ్ డిక్షనరీలు మాత్రమే ఇప్పునుంది. మిగిలిన 2 నుంచి. 44వ తరగతి, 7 నుంచి 10వ తరగతి విద్యార్థులకు డిక్షనరీలను అందించడం లేదు. ఈ ప్రకారమే పాఠ శాలలకు తరగతుల వారి సంబంధించిన ఇండెట్లను పంపింది. ఐదేళ్లపాటు డిక్షనరీని విద్యార్థులు జాగ్రత్తగా చూస్తారా? లేదా అనేది ఆలోచించాల్సిన విషయం. ప్రైవేట్ పాఠశాలల నుంచి కొంతమంది విద్యార్థులు 1, 6 తరగతుల్లో కాకుండా మిగిలిన తరగతుల్లో చేరే అవకాశం ఉంటుంది. తమ వద్ద డిక్షనరీల స్టాక్ కొంత ఉందని, ఈ విద్యార్థులకు వాటి నుంచి ఇస్తామని అధికారులు చెబుతున్నారు..
జిల్లా స్థాయిలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు జెవికె కిట్ల పంపిణీ కోసం జిల్లా స్థాయిలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని అన్ని జిల్లాల విద్యాశాఖ, సమ్రగ శిక్షా జిల్లా అదనపు ప్రాజెక్టు కో ఆర్డినేటర్లకు సమగ్ర శిక్షా ఆదేశాలు జారీ చేసింది.
0 Comments:
Post a Comment