✍️గ్రూప్-1’ డిజిటల్ మూల్యాంకనంలో కుంభకోణం??
♦దీనిలో 325 మంది ఎంపిక..
♦మాన్యువల్ మూల్యాంకనంలో 124 మందే
♦మరి 201 మంది అర్హులెలా అయ్యారు?తెరవెనుక ఏమైనా జరిగిందా?అభ్యర్థుల సందేహాలు,
♦కోర్టులో కేసుడిజిటల్‌లో ఎంపిక కానివారు సివిల్స్‌కుగ్రూప్-1ను అపహాస్యం చేసిన సర్కారు
*🌻(అమరావతి-ఆంధ్రజ్యోతి)* వైసీపీ సర్కారు హయాంలో చేపట్టిన గ్రూప్-1 డిజిటల్ మూల్యాంకనం అభాసు పాలైందనే విమర్శలు వస్తున్నాయి. డిజిటల్ మూల్యాంకనంలో 325 మంది అభ్యర్థులు ఎంపికకాగా, వీరి పరీక్ష పత్రాలను మాన్యువల్‌గా మూల్యాంకనం చేసినప్పుడు.. కేవలం 124 మందే అర్హత సాధించారు. మరి మిగిలిన.. 201 మంది డిజిటల్ మూల్యాంకనంలో ఎలా అర్హత సాధించారు? తెరవెనుక ఏమైనా జరిగిందా? ‘సర్దుబాట్లు’ ఏమైనా చేసుకున్నారా? అనే సందేహాలు తెరమీదికి వచ్చాయి. 2018లో అప్పటి టీడీపీ ప్రభుత్వం గ్రూప్-1 పోస్టుల కోసం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ పోస్టుల కోసం 325 మందిని ఇంటర్వ్యూ కోసం ఎంపిక చేయాలి. మెయిన్స్ పరీక్ష రాశాక.. అంతమందినీ ఎంపికచేశారు. అయితే అప్పటి వరకు మాన్యువల్‌గా జరిగిన మూల్యాంకనం స్థానంలో వైసీపీ ప్రభుత్వం హడావుడిగా డిజిటల్ మూల్యాంకన విధానం ప్రవేశపెట్టింది.
2021లో ఈ డిజిటల్ మూల్యాంకనం చేసి ఇంటర్వ్యూలకు అభ్యర్థులను ఎంపికచేశారు. అయితే, డిజిటల్ మూల్యాంకనంలో ఇంటర్వ్యూకు ఎంపికకాని అభ్యర్థులు తమకు అన్యాయం జరిగిందని హైకోర్టుకు వెళ్లారు. డిజిటల్ మూల్యాంకనం కోసం సరైన కసరత్తు చేయకుండానే.. సరైన సమాధానాలు రూపొందించకుండానే మూల్యాంకనం చేశారని.. దీంతో తాము ఇంటర్వ్యూకు ఎంపిక కాలేకపోయామని అభ్యర్థులు పేర్కొన్నారు. దీనికి సంబంధించిన పలు ఆధారాలను కోర్టుకు సమర్పించారు. దీంతో హైకోర్టు కూడా గ్రూప్-1 మూల్యాంకనం మాన్యువల్‌గా చేయాలని ఆదేశించింది. దీంతో మళ్లీ మాన్యువల్‌గా మూల్యాంకనం చేసి 325 మందిని ఎంపిక చేశారు. అయితే, ఇక్కడే లోపాలు బయటపడ్డాయి. గతంలో డిజిటల్ మూల్యాంకనం చేసినప్పుడు ఎంపికైన 325 మందిలో.. కేవలం 124 మంది మాత్రమే రెండోసారి మాన్యువల్‌గా చేసిన మూల్యాంకనంలో ఎంపికయ్యారు. తొలుత డిజిటల్ మూల్యాంకనంలో ఎంపికైన వారిలో 201 మంది తాజా మూల్యాంకనంలో ఎంపికకాలేదు. అంటే ఇది భారీ కుంభకోణమేననే ఆరోపణలు వస్తున్నాయి. అభ్యర్థులు హైకోర్టుకు వెళ్లబట్టి సరిపోయింది కానీ.. లేకుంటే నష్టపోయేవారని అంటున్నారు. గతంలో హరియాణలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ విషయంలో జరిగిన కుంభకోణం ఆ రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టించింది. చివరకు నాటి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చౌతాలాకు జైలు శిక్ష కూడా పడిందని గుర్తు చేస్తున్నారు.
♦వారంతా సివిల్స్‌కు ఎంపిక
మరోవైపు ఈ గ్రూప్-1 పరీక్ష రాసి డిజిటల్ మూల్యాంకనంలో ఎంపికకానివారు ఆ తర్వాత ఏకంగా సివిల్ సర్వీసె్‌సకు ఎంపికయ్యారు. గ్రూప్-1 కంటే సివిల్స్ క్లిష్టమైన పరీక్ష. స్థాయి కూడా ఎక్కువగా ఉంటుంది. కానీ, ఇక్కడ గ్రూప్-1 పరీక్ష రాసి ఎంపికకానివారు చాలామంది సివిల్స్‌లో ర్యాంకులు సాధించారు. అది కూడా ఐఏఎస్, ఐపీఎ్‌సలకు ఎంపికయ్యారు. అంటే అవకతవకలు డిజిటల్ మూల్యాంకనంలోనేనని స్పష్టంగా అర్థమవుతోందని పలువురు అభ్యర్థులు అప్పట్లోనే ఆరోపించారు. చాలా మంది అభ్యర్థులు ఇదే విషయాన్ని కోర్టులో ప్రస్తావించారు. మొత్తంగా ఈ డిజిటల్ మూల్యాంకనం వ్యవహారంలో జరిగిన అవకతవకాలపై లోతైన విచారణ జరిపించాలన్న డిమాండ్ వినిపిస్తోంది.
0 Comments:
Post a Comment