Weather Updates: బీ అలర్ట్ - తెలుగు రాష్ట్రాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు, వాతావరణ శాఖ హెచ్చరిక..
అరేబియా సముద్రంలో ఏర్పడుతున్న అల్పపీడనం కారణంగా బంగాళాఖాతం నుంచి వీచే గాలులతో ఏపీలో మరో మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం పేర్కొంది.
తెలంగాణ, తమిళనాడు, యానాంలోనూ ఉరుములు, మెరుపులతో కూడిన ఓ మోస్తరు వర్షాలు కురవనున్నాయి. ఈ రోజు నుంచి వర్షాలు మెళ్లమెళ్లగా పెరుగుతాయి. తెలంగాణ రాష్ట్రంలో సంగారెడ్డి, హైదరాబాద్ కి ఉత్తర భాగాలు ముఖ్యంగా మేడ్చల్ కి దగ్గర ఉన్న ప్రాంతాల్లో పిడుగులు, ఉరుములతో కూడిన వర్షాలు పడతాయి. ఏపీలో మధ్యాహ్నం కొండ ప్రాంతాల్లో మొదలైయ్యే వర్షాలు సాయంకాలం సమయంలో మిగిలిన చొట్లకు విస్తరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. వర్షాల కారణంగా తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీల మేర తగ్గుతాయని వాతావరణ కేంద్రం పేర్కొంది.
ఏపీలో వర్షాలు..
ఏపీలో పలు జిల్లాల్లో నిన్న వర్షాలు కురిశాయి. చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములతో కూడిన వర్షాలు కురవగా... రాయచోటి పారిసర ప్రాంతంలోని శేషాచలం అటవీ ప్రాంతం సమీపంలో, అన్నమయ్య జిల్లాలో పలు చోట్ల ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. చిత్తూరు జిల్లా వి.కోట, పలమనేరు సైడ్ లో అక్కడక్కడ వర్షాలు ఉంటాయి. ముఖ్యంగా రాత్రి సమయంలో అనంతపురం, సత్యసాయి జిల్లాలోని పశ్చిమ భాగాల్లో అక్కడక్కడ వర్షాలుంటాయి. ముఖ్యంగా కర్ణాటకను ఆనుకొని ఉండే భాగాల్లో వర్షాలు పడ్షనుంది.
తీరం వెంట బలమైన గాలులు వీస్తాయని, మత్స్యకారులు వేటకు వెళ్లడం ప్రమాదకరమని వాతావరణ శాఖ హెచ్చరించింది. రైతులు తమ ధాన్యాన్ని ఆరు బయట నిల్వ ఉంచితే వర్షాలకు తడిసిపోయే అవకాశం ఉందని జాగ్రత్తలు తీసుకోవాలని అన్నదాతలకు సూచించారు. మరోవైపున శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి, పార్వతీపురం, అల్లూరి సీతారామరాజు జిల్లా (పాడేరు) లో అక్కడక్కడ వర్షాలు పడతాయని అమరావతి వాతావరణ కేంద్రం, ఏపీ వెదర్ మ్యాన్ తెలిపారు. విశాఖ ఏజెన్సీ జి.మడుగులలో వడగండ్ల వర్షం కురిసిందని సమాచారం. కొన్ని చోట్ల భారీ వర్షాలతో పాటు పిడుగులు కూడ పడతాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
తెలంగాణలోనూ భారీ వర్షాలు.. (Temperature in Telangana)
తెలంగాణ రాష్ట్రంలో వికారాబాద్, హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాలు, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు, గద్వాల్, నారాయణపేట్ జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు పడే అవకాశం ఉంది. శ్రీశైలం నల్లమల అటవీ ప్రాంతం వద్ద భారీ ఉరుములు మెరుపులతో వర్షాలు కురిశాయి. నిన్న సాయంత్రం నుంచి రాత్రి వరకు పలు జిల్లాల్లో తేలికపాటి జల్లుల నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. నేటి నుంచి వర్షాలు మెళ్లగా పెరుగుతాయి. ఏప్రిల్ 17,18 న మరింత ఎక్కువగా వర్షాలు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.
0 Comments:
Post a Comment