UK Youth Practicing Urine Therapy: యూరిన్ థెరపీ... ఈ మాట వింటే వింతగా, కాస్త జుగుప్సగా అనిపించొచ్చు. కానీ ఇంగ్లాండ్‌కి చెందిన 34 ఏళ్ల హారీ మెటాడీన్ కొన్నేళ్లుగా 'యూరిన్ థెరపీ' ప్రాక్టీస్ చేస్తున్నాడు.
ప్రతీ రోజు తన మూత్రాన్ని తానే తాగుతుంటాడు. ఒకప్పుడు డిప్రెషన్‌తో, తెలియని ఆందోళనతో కుమిలిపోయిన తాను... యూరిన్ థెరపీ మొదలుపెట్టాక వాటి నుంచి బయటపడ్డానని చెబుతున్నాడు.
అంతేకాదు, దీని కారణంగా తాను మరింత యవ్వనంగా కనిపిస్తున్నానని.. ప్రస్తుతం 34 ఏళ్లు ఉన్నప్పటికీ 10 ఏళ్లు చిన్నవాడిలా కనిపిస్తున్నానని చెబుతున్నాడు.
ఎలాగైనా సరే డిప్రెషన్ నుంచి బయటపడాలనే తపనతో 2016లో తాను యూరిన్ థెరపీ మొదలుపెట్టానని మెటాడీన్ తెలిపాడు. 'నేను యూరిన్ తాగడం మొదలుపెట్టాక... అది నా మెదడును ఉత్తేజపరిచింది. నాలోని డిప్రెషన్‌ను పోగొట్టింది.
శాంతి, ప్రశాంతత, సంకల్పాన్ని కొత్తగా అనుభూతి చెందుతున్నాను. ఎప్పుడూ నేనిలాగే సంతోషంగా ఉండాలనుకున్నాను. అందుకే యూరిన్ థెరపీ ప్రాక్టీస్ చేస్తున్నాను.' అని మెటాడీన్ చెప్పుకొచ్చాడు.
ప్రతీ రోజూ తాను 200మి.లీ తన మూత్రాన్ని సేవిస్తానని మెటాడీన్ తెలిపాడు. నెల రోజుల పాటు నిల్వ చేసిన మూత్రాన్ని ఫ్రెష్ యూరిన్‌తో కలిపి తీసుకుంటానని చెప్పాడు.
దాని వాసన, రుచి అంటే తనకు ఇష్టమని తెలిపాడు. అంతేకాదు, కొన్నిసార్లు ఆ మూత్రంతోనే తన ముఖం కడుక్కుంటానని... మాయిశ్చరైజర్‌లా దాన్ని ముఖానికి అప్లై చేస్తానని చెప్పాడు. తద్వారా తన చర్మం మరింత కాంతివంతంగా మారిందని... నిత్య యవ్వనానికి ఇదొక సీక్రెట్ అని పేర్కొన్నాడు.
మెటాడీన్ యూరిన్ థెరపీపై పుస్తకాలు కూడా రాశాడు. అయితే మెటాడీన్‌కి ఉన్న ఈ అలవాటు అతన్ని కుటుంబ సభ్యులకు దూరం చేసింది. తన అలవాటు నచ్చక సోదరి తనను దూరం పెట్టినట్లు మెటాడీన్ చెప్పాడు.
వైద్య నిపుణులు మాత్రం ఇది మంచి అలవాటు కాదని చెబుతున్నారు. యూరిన్ థెరపీ మూలాలు ఈజిప్ట్‌లో ఉన్నాయని అంటున్నారు.
ఈ థెరపీ కారణంగా శరీరం డీహైడ్రేషన్‌కు గురవుతుందని... బాక్టీరియా బారినపడే ప్రమాదం కూడా ఉంటుందని హెచ్చరిస్తున్నారు.
0 Comments:
Post a Comment