Viral - బండికి రూ. 70 వేలు.. నెంబర్‌కు రూ. 15 లక్షలు
చాలామంది తమకు నచ్చిన బండి కొనడం కోసం అష్టకష్టాలు పడుతుంటారు. రూపాయి, రూపాయి పోగేసి బండి కొంటారు. చాలామంది పరిస్థితి ఇలా ఉంటే.. కొంతమంది మాత్రం తమ బండికి ఫ్యాన్స్ నెంబర్ కోసం లక్షలు ఖర్చు చేస్తుంటారు.
తాజాగా ఛండీఘడ్కు చెందిన ఓ వ్యక్తి కూడా ఫ్యాన్సీ నెంబర్ కోసం అక్షరాల రూ. 15 లక్షలు ఖర్చు చేశాడు. ఛండీఘడ్కు చెందిన బ్రిజ్ మోహన్ అడ్వర్టైజింగ్ ఏజెన్సీ రన్ చేస్తున్నాడు. ఆయన ఈ మధ్య ఆక్టివా స్కూటీ రూ.
71 (ఎక్స్ షోరూం ధర) వేలకు కొన్నాడు. ఆ బండికి ఫ్యాన్స్ నెంబర్ దక్కించుకోవాలనుకున్నాడు. చండీగఢ్ రిజిస్టరింగ్, లైసెన్సింగ్ అథారిటీ.. ఏప్రిల్ 14 నుంచి 16 వరకు సీహెచ్01-సీజే సిరీస్‌లో ఫ్యాన్సీ నంబర్లు, మిగిలిపోయిన నంబర్ల కోసం వేలం నిర్వహించింది. ఇందులో సీహెచ్01- సీజే-0001 ఫ్యాన్సీ నంబర్‌ను బ్రిజ్ మోహన్ రూ. 15.44 లక్షలకు దక్కించుకున్నాడు. ఇప్పుడు ఈ నెంబర్‌ను ఆక్టివా కోసం తీసుకున్నాను, భవిష్యత్తులో కారు కొన్న తర్వాత కారుకు కూడా ఇదే నెంబర్‌ను వేలంలో కొంటానని మోహన్ తెలిపాడు.
0 Comments:
Post a Comment