విడాకుల కేసు విచారణలో కన్నీళ్లు తెప్పించిన ఘటన.. తల్లిదండ్రుల గురించి 5 ఏళ్ల కొడుకు మాటలు విని..
వాళ్లిద్దరూ భార్యాభర్తలు.. చిన్న చిన్న విషయాలకే గొడవలు పడుతుండేవారు.. కలిసి ఉండలేక విడిపోదామని నిశ్చయించుకున్నారు.. పిల్లలిద్దర్నీ చెరొకరు పంచుకున్నారు..
విడాకులకు అప్లై చేసి కొన్ని నెలలుగా వేర్వేరు ఇళ్లలో ఉంటున్నారు.. విడాకుల కేసు విచారణ సందర్భంగా ఇద్దరూ కోర్టుకు వచ్చారు.. జడ్జి ఎదురుగానే ఇద్దరూ తిట్టుకున్నారు.. తమకు విడాకులు కావాల్సిందేనని భీష్మించుకుని కూర్చున్నారు.. ఆ సమయంలో న్యాయమూర్తి ఆ జంట పెద్ద కొడుకుని పిలిచారు.. `నువ్వు ఎవరితో ఉండాలనుకుంటున్నావు?` అని అడిగారు.. ఆ ప్రశ్నకు ఐదేళ్ల బాలుడు స్పందిస్తూ.. `నేను ఇద్దరితో కలిసి ఉండాలనుకుంటున్నాన`ని అమ్మానాన్న చేతులు పట్టుకున్నాడు. అప్పటివరకు తిట్టుకున్న ఆ భార్యాభర్తలు ఐదేళ్ల కొడుకు మాటలు విని కన్నీళ్లు పెట్టుకున్నారు.
ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్ మహిళా కమిషన్ కార్యాలయంలో ఈ ఘటన జరిగింది. రాయ్‌పూర్‌కు చెందిన ఈ జంట ప్రతి చిన్న విషయాలకు గొడవపడుతుండేది. ఇంటి పనులు, వంట భార్య సరిగా చేయదనేది అతని కంప్లైంట్. ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్‌లో పని చేసే భర్త ఇంటి ఖర్చుల గురించి పట్టించుకోడనేది ఆమె ఫిర్యాదు. దీంతో ఇంట్లో రోజూ గొడవలు జరుగుతుండేవి. అందుకే విడిపోవాలని దంపతులు ఇద్దరూ నిర్ణయించుకున్నారు. ఇద్దరు మగ పిల్లలను చెరొకరు పంచుకున్నారు. కొన్ని నెలలుగా వేర్వేరుగా నివసిస్తున్నారు. విడాకుల కోసం అప్లై చేశారు.
విడాకులకు అప్లై చేసిన జంటను మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ కౌన్సిలింగ్‌కు పిలిచారు. విడిపోయి వేర్వేరుగా బతకాలని కోరుకుంటున్నామని ఇద్దరూ ఛైర్ పర్సన్ ఎదుట చెప్పారు. దీంతో ఆమె ఆ జంట పెద్ద కొడుకుని పిలిచి.. `నువ్వు ఎవరితో ఉండాలనుకుంటున్నావు?` అని అడిగారు.. ఆ ప్రశ్నకు ఐదేళ్ల బాలుడు స్పందిస్తూ.. `నేను ఇద్దరితో కలిసి ఉండాలనుకుంటున్నాన`ని అమ్మానాన్నల చేతులు పట్టుకున్నాడు. అప్పటివరకు తిట్టుకున్న ఆ భార్యాభర్తలు ఐదేళ్ల కొడుకు మాటలు విని కన్నీళ్లు పెట్టుకున్నారు. పిల్లల కోసం రాజీ పడి కలిసి జీవిస్తామని చెప్పారు.
0 Comments:
Post a Comment