🔳వామ్మో.. స్కూల్‌కు రూ.20లక్షల వాటర్ బిల్.. అంతా ఆ టీచర్ వల్లే
ఇంటర్నెట్ డెస్క్: విద్యార్థులకు విద్యా బుద్ధులు నేర్పాల్సిన టీచర్ అనాలోచితంగా వ్యవహరించింది. ఫలితంగా ఆ స్కూల్ పెద్ద మొత్తంలో మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. ఏకంగా రూ.20లక్షల వాటర్ బిల్‌ను కట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..
కరోనా మహమ్మారి ప్రపంచాన్ని శాశ్వతంగా విడిచిపెట్టి పోవడం లేదు. ఈ వైరస్ విడతల వారీగా ప్రపంచంపై విరుచుకుపడుతూనే ఉంది. కాగా.. గత ఏడాది జూన్-సెప్టెంబర్ మధ్య కొవిడ్ ఉధృతి కాస్త తగ్గిన నేపథ్యంలో జపాన్‌లోని కొన్ని స్కూళ్లు తెరుచుకున్నాయి. క్లాస్ రూమ్‌లలోనే విద్యార్థులకు విద్యను అందించాయి. ఈ క్రమంలో ఓ స్కూల్‌లో పని చేస్తున్న టీచర్.. అనాలోచితంగా వ్యవహరించింది. స్మిమ్మింగ్ పూల్‌లో నిల్వ ఉండే నీరు వల్ల పిల్లలు కరోనా బారిన పడే అవకాశం ఉందని భావించింది. పూల్‌లో నిత్యం నీరు పారుతూ ఉండేలా చేయడమే ఈ సమస్యకు పరిష్కారమని ఫీలైంది. ఈ క్రమంలో ఓ కుళాయి తిప్పి నీటిని పూల్‌లోకి వదిలేసింది. ఇలా నిత్యం నీరు పారుతూ ఉంటే.. వైరస్ కోట్టుకుపోతుందనీ.. అపుడు విద్యార్థులు పూల్‌లో స్మిమ్మింగ్ చేసినా కరోనా వ్యాప్తి చెందదనేది ఆమె ఆలోచన. అందులో భాగంగా ఏకంగా మూడు నెలలపాటు ట్యాప్ తిప్పే ఉంచింది. సహోద్యోగులు కులాయిని కట్టేసినా ఆ టీచర్ మాత్రం దాన్ని తిరిగి ఆన్ చేసింది. 4వేల టన్నుల నీరు వృథాగా పోయింది. ఈ క్రమంలోనే ఆ స్కూల్ ఏకంగా 27వేల డాలర్ల (రూ.20లక్షల) వాటర్ బిల్లను అందుకుంది. ఈ విషయాన్ని స్థానిక ఎడ్యుకేషన్ బోర్డు అధికారి అకిరా కొజిరీ తాజాగా మీడియాకు వెల్లడించింది. దీంతో ఈ విషయం ప్రపంచ వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది.
0 Comments:
Post a Comment