ఈ రోజుల్లో చాలామంది అజీర్తి, దగ్గు.. వంటి చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు వచ్చినా ట్యాబ్లెట్లతో తగ్గించుకుంటున్నారు. అయితే వీటిని తరచూ వాడడం ఆరోగ్యకరం కాదు.
కాబట్టి వంటింట్లో లభించే వాముతో ఇలాంటి చిన్న అనారోగ్యాల్ని ఇట్టే దూరం చేసుకోవచ్చని చెబుతున్నారు నిపుణులు. అదెలాగో తెలుసుకుందాం రండి.. ఈ రోజుల్లో చాలామంది అజీర్తి, దగ్గు.. వంటి చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు వచ్చినా ట్యాబ్లెట్లతో తగ్గించుకుంటున్నారు.
అయితే వీటిని తరచూ వాడడం ఆరోగ్యకరం కాదు. కాబట్టి వంటింట్లో లభించే వాముతో ఇలాంటి చిన్న అనారోగ్యాల్ని ఇట్టే దూరం చేసుకోవచ్చని చెబుతున్నారు నిపుణులు. అదెలాగో తెలుసుకుందాం రండి.. అసిడిటీకి దూరంగా..
అసిడిటీకి దూరంగా.. అసిడిటీకి దూరంగా.. అసిడిటీతో బాధపడుతున్నారా? అయితే..
గిన్నెలో ఒక గ్లాసు నీళ్లు పోసి అందులో ఒక టీస్పూన్ వాము, ఒక టీస్పూన్ జీలకర్ర.. వేసి బాగా మరిగించాలి. అసిడిటీతో బాధపడుతున్నప్పుడు ఈ మిశ్రమాన్ని తాగితే సమస్య నుంచి తక్షణ ఉపశమనం కలుగుతుంది. బాలింతలకు మేలు!
బాలింతలకు మేలు! బాలింతలకు మేలు! గర్భం దాల్చిన మహిళలకు, పాలిచ్చే తల్లులకు వాము చాలా ఉపయోగపడుతుంది. కడుపుతో ఉండే మహిళలకు సాధారణంగా ఎదురయ్యే మలబద్ధకం, అజీర్తిని ఇది దూరం చేస్తుంది.
అలాగే బాలింతల్లో పాల ఉత్పత్తిని పెంచుతుంది. గుండెకు రక్షణ.. గుండెకు రక్షణ.. గుండెకు రక్షణ..
వాములో ఉండే నియాసిన్ గుండె సంబంధిత సమస్యలు దరిచేరకుండా కాపాడుతుంది. కొంచెం వామును నీళ్లలో వేసి మరిగించి రోజూ పరగడుపున తాగితే గుండె సంబంధిత వ్యాధులు రాకుండా ఉంటాయి. దగ్గు నుంచి ఉపశమనం.. దగ్గు నుంచి ఉపశమనం..
దగ్గు నుంచి ఉపశమనం.. వాములో ఉండే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్.. మొదలైన గుణాల వల్ల దగ్గు, ఆస్తమా.. వంటి ఆరోగ్య సమస్యల నుంచి విముక్తి కలుగుతుంది.
అలాగే ఇందులోని యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఆర్థ్రైటిస్ వల్ల ఏర్పడే నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తాయి. నోరు శుభ్రంగా..! నోరు శుభ్రంగా..! నోరు శుభ్రంగా..!
వాము నూనెను టూత్పేస్ట్ల్లో, మౌత్ వాష్ల్లో వాడతారు. ఇది నోటిలోని బ్యాక్టీరియాతో పోరాడి నోటి నుంచి దుర్వాసన రాకుండా చేస్తుంది. అలాగే కొద్దిగా వామును నోట్లో వేసుకుని నమిలినా ఫలితం ఉంటుంది. మరికొన్ని..
మరికొన్ని.. మరికొన్ని.. * చెవినొప్పితో బాధపడే వారు కొన్ని చుక్కల వాము నూనెను చెవిలో వేసుకుంటే సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. * నెలసరి సమయంలో చాలామంది మహిళలకు కడుపునొప్పి రావడం సహజం.
అలాంటి సమయంలో వేయించిన వామును పాలలో కలుపుకుని వేడిచేసుకుని తాగినా ఫలితం ఉంటుంది. * వామును కూరలు, పకోడీలు, పరాటాలు, చపాతీలు.. మొదలైన ఆహార పదార్థాల తయారీలో వాడితే అటు రుచికి రుచి.. ఇటు ఆరోగ్యానికి ఆరోగ్యం సొంతం చేసుకోవచ్చు.
* వాము నూనెను కీళ్ల నొప్పులున్న చోట రాస్తే నొప్పి తగ్గిపోతుంది. * వాము, తేనె, వెనిగర్.. ఈ మూడింటినీ కొద్ది మొత్తాల్లో తీసుకుని బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని 10 రోజుల పాటు రోజూ కొంచెం కొంచెంగా తీసుకుంటే మూత్రపిండాల్లో ఏర్పడిన రాళ్లు కరుగుతాయి.
* వాము వేసి మరిగించిన నీటిని గోరువెచ్చగా అయ్యేదాకా పక్కన పెట్టాలి. ఆపై ఈ నీటితో పుక్కిలిస్తే పంటి నొప్పులు దూరమవుతాయి. * గర్భవతులు వామును రోజూ తీసుకుంటే శరీరంలో రక్తం శుభ్రపడటంతో పాటు రక్తప్రసరణ బాగా జరుగుతుంది. * వామును రోజూ ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల స్థూలకాయం, అధిక బరువు నుంచి విముక్తి పొందచ్చు.
0 Comments:
Post a Comment