తెలంగాణలో భారీగా ఉద్యోగాలను(Telangana Government Jobs) భర్తీ చేయనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలోనే అత్యంత కీలకమైన గ్రూప్-1తోపాటు పోలీస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు విడుదల చేయనున్నట్టు తెలిసింది. పరీక్షను పారదర్శకంగా నిర్వహించేందుకు బోర్డు అన్ని ఏర్పాట్లు చేస్తోంది. . ఒకటికి రెండు సార్లు సమీక్షలు నిర్వహించి ప్రణాళికలు రచించాయి.
గ్రూప్-1 నోటిఫికేషన్ ద్వారా 19 ప్రభుత్వ విభాగాల్లో 503 పోస్టులను భర్తీ చేయనున్నారు. శనివారం టీఎస్పీఎస్సీ చైర్మన్ అధ్యక్షతన కమిషన్ సమావేశమైంది. ఈ ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు రద్దుతో నియామక ప్రక్రియలో సుమారు మూడు నెలల సమయం ఆదా కానున్నదని చర్చించారు.
పోలీస్ నియమాలు కూడా..
పోలీస్ ఉద్యోగాల భర్తీకి తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలి (టీఎస్ఎల్పీఆర్బీ) ఏర్పాట్లు పూర్తిచేసింది. సోమవారమే పోలీస్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ సైతం రానున్నట్టు సమాచారం. 16 వేల పైచిలుకు పోస్టులను భర్తీ చేయనున్నట్లు సమాచారం. ఈ ఉద్యోగాలకు ప్రభుత్వం మూడేండ్లు వయోపరిమితి పెంచింది. దీని ద్వారా సుమారు 7 లక్షల మందికి ఎక్కువగా పోటీ పడే అవకాశం ఉంది.
మూడు నెలలు ఆదా..
గ్రూప్ 1కు సంబంధించి ఇంటర్వ్యూలకు 100 మార్కులు ఉండేవి. రాత పరీక్షకు 900 మార్కులు ఉండేవి. దీంతో మొత్తం 1000 మార్కులకు గాను అభ్యర్థులు సాధించిన మార్కుల ఆధారంగా ఎంపికను నిర్వహించే వారు. గ్రూప్-2 విషయానికి వస్తే.. రాత పరీక్షకు 600 మార్కులు.. ఇంటర్వ్యూలకు 75 మార్కులు ఉండేవి. దీంతో మొత్తం 675 మార్కులకు గాను అభ్యర్థులు సాధించిన మార్కుల ఆధారంగా తుది ఎంపిక ఉండేది. దీంతో గ్రూప్-1ను 900 మార్కులకు, గ్రూప్-2ను 600 మార్కులకు నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇంటర్వ్యూలను రద్దు చేయడం వల్ల మూడు నెలలు ఆదా అవుతుందని అధికారులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
"టెట్" సమస్య తలెత్తకుండా పరీక్ష కేంద్రాల ఎంపిక..
ఇటీవలే టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) దరఖాస్తు సమయంలో పరీక్షా కేంద్రాల కేటాయింపులో ఇబ్బందులు తలెత్తాయి. ఈ సారి అలాంటి అవకాశం లేకుండా ఏర్పాటు చేస్తున్నారు. ఈసారి గ్రూప్-1 ప్రిలిమ్స్‌కు సెంటర్ల కేటాయింపులో ప్రతి అభ్యర్థికి 8 నుంచి 10 ఆప్షన్లు ఇవ్వనున్నారు.
ఒక అభ్యర్థి 8 -10 వరకు జిల్లాలను ఎంపికచేసుకోవాలి. ప్రియారిటీ ప్రకారం.. మొదటి ఆప్షన్లో సీట్ లేకుంటే రెండో జిల్లాకు.. అక్కడ సీట్ లేకుంటే మూడో జిల్లాను కేటాయిస్తారు. దరఖాస్తు సమయంలో ప్రతి అభ్యర్థి 8-10 జిల్లాలను తప్పనిసరిగా ఆప్షన్స్‌గా ఎంచుకోవాలి. ఒకటి రెండు ఎంచుకుంటే ఇబ్బందులు తప్పవు.
0 Comments:
Post a Comment