Top 10 Safest Cars: ఇండియాలో టాప్ 10 సురక్షితమైన కార్లు ఇవే
కొత్త కారు కొంటే ఫీచర్స్ ఏం ఉన్నాయి? మైలేజీ ఎంత ఇస్తుంది? ఆన్ రోడ్ ధర ఎంత? ఈఎంఐ ఎంత కట్టాలి? అన్న విషయాలు మాత్రమే చూస్తారు కానీ... ఆ కారు సేఫ్టీ ఫీచర్స్ చూసేవాళ్లు తక్కువే.
ఇటీవల ఫోర్‌వీలర్ కొనేప్పుడు సేఫ్టీ ఫీచర్స్ (Car Safety Features) చూసే అలవాటు కస్టమర్లలో కొంత పెరుగుతూ వస్తోంది. మరోవైపు కంపెనీలు కూడా సేఫ్టీ ఫీచర్స్ విషయంలో కస్టమర్లకు అవగాహన కల్పిస్తున్నాయి. గ్లోబల్ న్యూ కార్ అసెస్‌మెంట్ ప్రోగ్రామ్ (Global NCAP) తన సేఫ్ కార్ ఇండియా మిషన్ (Safer Car for India Mission) కార్యక్రమంలో భాగంగా మేడ్ ఇన్ ఇండియా కార్లను క్రాష్ టెస్ట్ చేసి ర్యాంకులు ఇచ్చింది. కారులో ముందు రెండు ఎయిర్‌బ్యాగ్‌లు మాత్రమే పని చేస్తున్న క్రాష్ టెస్ట్‌లో పెద్దలు, పిల్లల భద్రత ఎలా ఉందన్న అంశాన్ని పరిశీలించాయి. ఈ లిస్ట్‌లో మహీంద్రా, టాటా మోటార్స్ కార్లు టాప్‌లో నిలవడం విశేషం. మరి ఏ కారు ఎంత సేఫ్‌గా ఉందో తెలుసుకోండి.
Mahindra XUV 700: భారతదేశంలో సురక్షితమైన కార్ల జాబితాలో మహీంద్రా ఎక్స్‌యూవీ 700 మొదటి స్థానంలో ఉంది. క్రాష్ టెస్ట్‌లో ఈ కారుకు అడల్ట్ ప్యాసింజర్స్ భద్రతకు 5 స్టార్ రేటింగ్, పిల్లల భద్రతకు 4 స్టార్ రేటింగ్ లభించింది. ఎక్స్‌యూవీ 700 కారు గతేడాది రిలీజైంది. ఇందులో ఫ్రంట్ కొల్లిజన్ వార్నింగ్, ఎమర్జెన్సీ అటానమస్ బ్రేకింగ్, అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెంట్ సిస్టమ్ లాంటి సేఫ్టీ ఫీచర్స్ ఉన్నాయి.
Goa Tour: హైదరాబాద్ నుంచి గోవా టూర్... రూ.10,000 లోపే ఐదు రోజుల ట్రిప్
Tata Punch: టాటా పంచ్ కాంపాక్ట్ ఎస్‌యూవీ కార్ ఇటీవల రిలీజైంది. సురక్షితమైన కార్ల జాబితాలో రెండో స్థానంలో నిలిచింది. క్రాష్ టెస్ట్‌లో ఈ కారుకు అడల్ట్ ప్యాసింజర్స్ భద్రతకు 5 స్టార్ రేటింగ్, పిల్లల భద్రతకు 4 స్టార్ రేటింగ్ లభించింది.
Mahindra XUV 300: మహీంద్రా ఎక్స్‌యూవీ 700 కన్నా మహీంద్రా ఎక్స్‌యూవీ 300 కాస్త చిన్నగా ఉంటుంది. ఎక్స్‌యూవీ 700 కారుకు వచ్చిన సేఫ్టీ రేటింగ్ ఎక్స్‌యూవీ 300 కారుకు రావడం విశేషం. క్రాష్ టెస్ట్‌లో ఈ కారుకు అడల్ట్ ప్యాసింజర్స్ భద్రతకు 5 స్టార్ రేటింగ్, పిల్లల భద్రతకు 4 స్టార్ రేటింగ్ లభించింది.
Tata Altroz: టాటా ఆల్ట్రోజ్ కారుకు క్రాష్ టెస్ట్‌లో అడల్ట్ ప్యాసింజర్స్ భద్రతకు 5 స్టార్ రేటింగ్ వస్తే, పిల్లల భద్రతకు మాత్రం 3 స్టార్ రేటింగ్ లభించింది.
Tata Nexon: టాటా ఆల్ట్రోజ్ కారుకు క్రాష్ టెస్ట్‌లో వచ్చిన రేటింగే టాటా నెక్సాన్‌కు కూడా వచ్చింది. అడల్ట్ ప్యాసింజర్స్ భద్రతకు 5 స్టార్ రేటింగ్ వస్తే, పిల్లల భద్రతకు మాత్రం 3 స్టార్ రేటింగ్ లభించింది.
Mahindra Thar: మహీంద్రా థార్ క్రాష్ టెస్ట్‌లో ఆరో స్థానంలో నిలిచింది. ఈ కారులో అన్ని వేరియంట్లలో రెండు ఎయిర్‌బ్యాగ్స్ లభిస్తాయి. ఈ ఫోర్ వీలర్‌కు క్రాష్ టెస్ట్‌లో అడల్ట్ ప్యాసింజర్స్ భద్రతకు, పిల్లల భద్రతకు మాత్రం 4 స్టార్ రేటింగ్ లభించింది.
Honda City (4th Generation): హోండా సిటీ నాలుగో జనరేషన్ సెడాన్ కారుకు క్రాష్ టెస్ట్‌లో మహీంద్రా థార్‌కు వచ్చిన రిజల్టే వచ్చింది. అడల్ట్ ప్యాసింజర్స్ భద్రతకు, పిల్లల భద్రతకు మాత్రం 4 స్టార్ రేటింగ్ లభించింది.
IRCTC Kullu Manali Tour: హైదరాబాద్ నుంచి కులు మనాలీ టూర్ ప్యాకేజీ
Tata Tigor EV: టాటా టిగార్ ఈవీ Global NCAP క్రాష్ టెస్ట్ నిర్వహించిన తొలి ఎలక్ట్రిక్ కార్ కావడం విశేషం. టాటా టిగార్ ఎలక్ట్రిక్ వెహికిల్‌కు క్రాష్ టెస్ట్‌లో అడల్ట్ ప్యాసింజర్స్ భద్రతకు, పిల్లల భద్రతకు మాత్రం 4 స్టార్ రేటింగ్ లభించింది.
Toyota Urban Cruiser: టొయోటా అర్బన్ క్రూజర్ కారుకు Global NCAP క్రాష్ టెస్ట్‌లో అడల్ట్ ప్యాసింజర్స్ భద్రతకు 4 స్టార్ రేటింగ్ వస్తే, పిల్లల భద్రతకు మాత్రం 3 స్టార్ రేటింగ్ లభించింది.
Tata Tigor/Tiago: టాటా టిగార్, టాటా టియాగో కార్లు 10వ స్థానంలో నిలిచాయి. క్రాష్ టెస్ట్‌లో ఈ కార్లకు అడల్ట్ ప్యాసింజర్స్ భద్రతకు 4 స్టార్ రేటింగ్ వస్తే, పిల్లల భద్రతకు మాత్రం 3 స్టార్ రేటింగ్ లభించింది.
0 Comments:
Post a Comment