How to relief muscle cramp : సాదరణంగా ఎక్కువసేపు నిలబడినప్పుడు కాళ్ళు పట్టేసి నొప్పులు వస్తాయి. ఇలాంటి సమయంలో నొప్పి తగ్గటానికి మందులను వాడుతూ ఉంటాం.
అలా కాకుండా నొప్పులను తగ్గించటానికి ఇంటి చిట్కా చాలా బాగా పనిచేస్తుంది. ఆవనూనెలో ముద్ద కర్పూరంను పొడిగా చేసి కలపాలి.
ఈ మిశ్రమాన్ని నొప్పులు ఉన్న ప్రదేశంలో రాసి సున్నితంగా మసాజ్ చేయాలి. ఈ విధంగా చేయటం వలన కండరాలు రిలాక్స్ అవుతాయి. ఆతర్వాత ఒక టవల్ తీసుకొని వేడి నీటిలో ముంచి నీటిని పిండేసి కాలికి చుట్టాలి. దీని నుంచి వచ్చే వేడి కండరాల నొప్పులు,వాపులను తగ్గిస్తుంది. నొప్పులు ఎక్కువగా ఉంటే రోజులో రెండు సార్లు ఈ విధంగా చేయవచ్చు.
కర్పూరం నరాల చివర్లను ఉత్తేజపరచి నొప్పులను తగ్గిస్తుంది. ఆవనూనె నొప్పుల నుండి ఉపశమనం కొరకు చాలా ప్రసిద్ది చెందింది. పూర్వ కాలం నుండి నొప్పుల నివారణకు ఆవనూనె వాడుతున్నారు. ఆవనూనెలో ఉండే ఒమేగా ప్యాటి యాసిడ్స్ నొప్పి నుండి ఉపశమనం కలిగిస్తాయి. కండరాల నొప్పిని తగ్గించటమే కాకుండా బెణుకులను కూడా తగ్గిస్తుంది.
నిద్రలో కాలి పిక్కలు పట్టేసే సమస్య ఉన్నవారు రాత్రి పడుకోవటానికి ముందు కర్పూరం కలిపిన ఆవనూనెను రాసి మసాజ్ చేస్తే సరిపోతుంది. ఇలా చేస్తూ ఉంటే క్రమంగా కాలి పిక్కలు పట్టటం మరియు కండరాల నొప్పులు,కండరాలు పట్టేయటం వంటి సమస్యలు ఉండవు.
0 Comments:
Post a Comment