Teeth Whitening Tips: మనం సాధారణంగా శరీరంలోని ప్రతి భాగాన్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటాం. కానీ మన దంతాలు పసుపు రంగులోకి (Yellow Teeth) మారితే పెద్దగా పట్టించుకోం.
పళ్లు తెల్లగా లేకపోతే చాలాసార్లు ఇబ్బంది పడాల్సి వస్తోంది. మీరు రోజూ బ్రష్‌తో శుభ్రం చేసినా ఆ పసుపు రంగు పోవట్లేదా?. అయితే ఈ 5 హోం రెమెడీలు (home remedies) ట్రై చేయండి. మీ పళ్లు తెల్లగా మెరవడమేకాకుండా.. డెంటల్ క్లినిక్ ఖర్చు కూడా ఆదా అవుతుంది.
దంతాల పసుపును తొలిగించే 5 రెమిడీస్:
1. అల్లం
మిక్సర్ గ్రైండర్ లేదా మోర్టార్లో చిన్న అల్లం (ginger) ముక్కలను గ్రైండ్ చేసి, ఆపై 1/4 టీస్పూన్ ఉప్పును కలపండి. అందులో నిమ్మరసం కూడా యాడ్ చేయండి. ఈ మూడింటి మిశ్రమాన్ని టూత్ బ్రష్‌తో దంతాలపై రుద్దండి.
2. వేప ఆకులు
వేపలో ఉండే ఔషధ గుణాల గురించి మనందరికీ తెలుసు. దాని ఆకులను (Neem Leaves) వేడి నీటి కుండలో ఉడకబెట్టి, ఆపై నీటిని ఫిల్టర్ చేసి, అది చల్లబడే వరకు వేచి చూడండి. ఇప్పుడు ఈ నీటితో పుక్కిలించండి. వేప యొక్క చేదు నోటి మరియు దంతాలలో ఉండే క్రిములను చంపుతుంది.
3. ఎప్సమ్ సాల్ట్
ఎప్సమ్ ఉప్పును (Epsom Salt) మెగ్నీషియం సల్ఫేట్ అని కూడా అంటారు. ఈ ఉప్పు మరియు నీటిని సమాన పరిమాణంలో కలపండి. టూత్ బ్రష్‌తో మీ దంతాల మీద మిశ్రమాన్ని రుద్దండి, ఆపై మీ నోరు కడగాలి.
4. కోకో పౌడర్
కోకో (Cocoa) పౌడర్ని నీరు లేదా కొబ్బరి నూనెతో కలిపి పేస్ట్‌లా చేయండి. తర్వాత బ్రష్‌పై అప్లై చేసి దంతాలను శుభ్రం చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఉపయోగించడం వల్ల దంతాల ప్రకాశవంతంగా మెరుస్తాయి.
5. పుదీనా ఆకులు
పుదీనా చాలా ఉపయోగాలుఉన్నాయి. 3 లేదా 4 ఆకులను గ్రైండ్ చేసి కొబ్బరినూనెలో కలపాలి. ఈ మిశ్రమాన్ని (Powder Mint) టూత్ బ్రష్ మీద అప్లై చేసి దంతాల మీద రుద్దండి.
0 Comments:
Post a Comment