దిశ, ఫీచర్స్ : వేసవిలో శరీరాన్ని చల్లగా ఉంచుకునేందుకు రకరకాల ఐటమ్స్ తింటుంటాం. నీరు ఎక్కువగా లభించే పుచ్చకాయ, కీర దోసకాయ, పెరుగు, మజ్జిగ లాంటి పదార్థాలు కడుపులో చల్లదనాన్ని ఇస్తూ మండుటెండల్లో కాస్త రిలీఫ్ కలిగిస్తాయి.
ఇందులో ముఖ్యంగా కీర దోసతో అనేక రకాల లాభాలున్నాయి అనుకుంటాం. అయితే వీటితో పాటు అమితమైన నష్టాలు కూడా ఉన్నాయి.
* పచ్చి దోసకాయ తినడం వల్ల చాలా మందికి గ్యాస్, గుండెల్లో మంట వస్తుంది. అలాంటప్పుడు కాసేపు ఫ్రిజ్లో పెట్టి ఆ తర్వాత తినండి.
* విటమిన్ సి పుష్కలంగా ఉండటం వలన సైడ్ ఎఫెక్ట్స్ కలిగిస్తుంది. అధిక పొటాషియం బలహీనమైన మూత్రపిండాలను ఒత్తిడికి గురిచేసి కిడ్నీ వ్యాధులకు దారితీస్తుంది.
* దోసకాయ శరీరాన్ని చల్లబరుస్తుంది కానీ ఇందులో ఉండే అదనపు నీరు గుండెపై ఒత్తిడిని కలిగిస్తుంది. సైనస్ సమస్యలను తీవ్రతరం చేస్తుంది.
* దీన్ని ఎక్కువగా తీసుకుంటే నోటి మరియు చర్మ అలెర్జీకి కారణమవుతుంది.
* సాధారణంగా దోసకాయ ముదరకుండా ఉండేందుకు రైతులు దానిపై మైనపు పూత పూస్తారు. అందుకే దాని షెల్ భాగం తొలగించకుండా తింటే విషపూరితంగా మారే చాన్స్ ఉంది.
0 Comments:
Post a Comment