అన్నాన్ని పరబ్రహ్మ స్వరూపంగా భావించి తినేముందు కాళ్లు, చేతులు కడుక్కుని మరీ భోజనానికి కూర్చుంటాం. కొందరైతే ముందుగా దేవుడిని స్మరించుకుని తింటారు.
ఎందుకంటే ఎన్ని ఇబ్బందులున్నా అన్నపూర్ణాదేవి అనుగ్రహం ఉంటే చాలని భావిస్తారు.అయితే దైవస్వరూపంగా భావించే భోజనం విషయంలో కొన్ని నియమాలు పాటించాలి.
ఇలాంటి నియమాలు చాలా ఉన్నప్పటికీ చాలామంది ఈ ఐదు తప్పులు చేస్తుంటారు. వీటిలో ఏ ఒక్కటి మీలో ఉన్నా మార్చుకోవాల్సిందే. లేదంటే మిమ్మల్ని పట్టన దరిద్రం వదిలిపెట్టి పోదు.
అన్నం తినేటప్పుడు చేయకూడని-మార్చుకోవాల్సినవి ఇవే
అలాగే అన్నం తినేటప్పుడు అది ప్లేట్ చుట్టూ పడకుండా జాగ్రత్త పడాలి. ఒకవేళ కిందపడినా వెంటనే తీసేయాలి. కింద పడ్డ తుకులను ఎవరూ తొక్కకుండా శుభ్రం చేయాలి.
అన్నం తినేటప్పుడు ఎప్పుడూకూడా మాట్లాడకుండా ఆహారాన్ని ముగించాలి. ఆహారాన్ని ముగించిన తరువాత చేతులను ప్లేట్ లో కడగకూడదు. చేతులు బయట కడుక్కోవాలి.
తిన్న ప్లేట్లో చేతులు కడగకూడదు, ప్లేట్ ఎండిపోకూడదు... చేతులు కడిగినా, తిన్న ప్లేట్ ఎండినా దరిద్రాన్ని తెచ్చిపెడుతుందని చెబుతారు.అందుకే ఆహారం ముగించి నిద్రపోయేముందు గిన్నెలు శుభ్రం చేయడమో లేదంటే అవి ఎండిపోకుండా నీళ్లు పోయడమో చేస్తుంటారు.
అన్నం తినేటప్పుడు మధ్యలో దగ్గో, తుమ్మో వస్తే అక్కడే ఉమ్మేయడం, దగ్గేయడం చేయరాదు. పొలమారితి అక్కడి నుంచి లేచి వెళ్లి చేతులుకడుక్కుని వచ్చి భోజనం చేయాలి. ఇది పరమదరిద్రం
కూర్చుని మాత్రమే భోజనం చేయాలి ఎప్పుడూ కూడా నిలబడి తినకూడదు. తిన్నాక చేతులు విదిలించకూడదు. కడుక్కున్న చేతుల్ని శుభ్రంగా తుడుచుకోవాలి.భోజనం పూర్తైన తర్వాత పుల్లలు, వేళ్లు నోట్లో పెట్టుకునే అలవాటు చాలామందికి ఉంటుంది.అది అస్సలు మంచిది కాదు. నీళ్లను పుక్కిలించి ఉమ్మేయడం మంచిది.
భోజనం పూర్తైన తర్వాత ఒళ్లంతా బరువుగా ఉందంటూ తిన్నప్లేట్ పక్కనే నడుం వాలుస్తారు...అది పరమ దరిద్రానికి హేతువు. తిన్న ప్లేట్ అక్కడే ఉంచి ఎప్పుడూ ఆ పక్కనే నిద్రపోరాదు.
మన పూర్వికులు పెట్టిన ఇలాంటి నియమాలను చాదస్తం అనుకోవడానికి లేదు. ఎందుకంటే ఇందులో ఇవి మీ ఆరోగ్యాన్ని, పద్ధతులను మెరుగుపరచడంతో పాటూ చుట్టుపక్కలవారు ఇబ్బంది పడకుండా కూడా ఉపయోగపడతాయని గుర్తించాలి.
ఇంకా చెప్పాలంటే పరిశుభ్రంగా ఉండడం. ఆహారాన్ని క్రమపద్ధతిలో తీసుకోవడం ఇన్నీ నమ్మకాలు కాదు పాటించాల్సిన నియమాలు. వీటిని ఆచరించడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యం, ఐశ్వర్యం సిద్ధిస్తుంది.
0 Comments:
Post a Comment