మన దేశంలో టాప్ 10 చిత్రాలేవీ అంటే చెప్పడం కష్టం. అయితే భారీ కలెక్షన్లు రాబట్టిన చిత్రాలేంటనేవి ఠక్కున చెప్పేస్తాం.
గత కొన్ని సంవత్సరాలుగా రాజమౌళి తెరకెక్కించిన చిత్రాలు భారీ కలెక్షన్స్ రాబడుతున్నాయి. 'బాహుబలి'తో మొదలైన ఈ కలెక్షన్ల వెల్లువ ఇంకా కొనసాగుతోంది. తాజాగా తాను తీసిన 'ఆర్‌ఆర్‌ఆర్' మూవీ కూడా వెయ్యి కోట్ల వసూళ్లను రాబడుతుందని టాక్. రాజమౌళి తీసిన ఈ రెండు చిత్రాలే కాకుండా.. ఇప్పటివరకు భారత్‌లో అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రాలేంటి? ఏ చిత్రాలు టాప్ 10 గ్రాస్ వసూళ్లు సాధించాయో తెలుసుకుందామా..!
1. దంగల్ రూ. 2,024 కోట్లు
2. బాహుబలి పార్ట్ 2 - రూ. 1810 కోట్లు
3. ఆర్‌ఆర్‌ఆర్ రూ. 969 కోట్లు
4. బజరంగీ భాయిజాన్ : 969 కోట్లు
5. సీక్రెట్ సూపర్ స్టార్ - 967 కోట్లు
6. పీకె - రూ. 854 కోట్లు
7. రోబో 2.0 - రూ. 800 కోట్లు
8. బాహుబలి పార్ట్ 1 - రూ. 650 కోట్లు
9. సుల్తాన్ రూ. 623 కోట్లు
10. సంజు - 587 కోట్లు.
ఈ టాప్ 10 గ్రాస్‌లో అమీర్‌ఖాన్ చిత్రాలే మూడు ఉన్నాయి. ఆ తర్వాత రాజమౌళి తీసిన బాహుబలి 1-2, ఆర్‌ఆర్‌ఆర్ చిత్రాలు ఉన్నాయి. హిందీ మాతృక సినిమాల కంటే.. తెలుగు చిత్రాలే బాలీవుడ్‌లో సత్తా చాటుతున్నాయి. అత్యధిక వసూళ్లు చేసిన మొదటి మూడు చిత్రాల్లో రెండు చిత్రాలు రాజమౌళివే కావడం గమనార్హం. ఇటీవల విడుదలయిన ఆర్‌ఆర్‌ఆర్ మూవీ 969 కోట్లతో మూడు స్థానంలో ఉంది. వెయ్యి కోట్ల కలెక్షన్లను కూడా దాటేస్తుంది. ఈ చిత్రాల వసూళ్ల వివరాలు వికీపీడియా ఆధారంగా తీసుకున్నవి. ఫైనల్ గ్రాస్ వసూళ్లలో స్వల్ప మార్పులు ఉండొచ్చు.
0 Comments:
Post a Comment