Rains in AP, Telangana: తెలుగు రాష్ట్రాల ప్రజలకు చల్లటి వార్త.. రాగల మూడు రోజుల్లో వర్షాలు
భానుడి భగభగలతో అల్లాడుతున్న తెలంగాణ(Telangana) ప్రజలకు వాతావరణశాఖ చల్లటి వార్త చెప్పింది. రాగల మూడు రోజులు రాష్ట్రంలో ఒకటి, రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వెల్లడించింది.
పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని తెలిపింది. శ్రీలంక(Sri Lanka) సమీపంలో కొమరీన్ ప్రాంతంపై బంగాళాఖాతంలో అల్పపీడనం(Low Pressure) ఆవరించి ఉంది. ఇది తమిళనాడు తీరం వరకు గాలులతో కూడిన ఉపరితల ద్రోణి ఏర్పడింది. దీని ప్రభావంతోనే ఈ రోజు భారీ వర్షాలు, రేపటి నుంచి మూడు రోజులపాటు ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపింది.
మరోవైపు.. ఆంధ్రప్రదేశ్ లో సూర్యుడు సుర్రుమంటున్నాడు. దిగువ ట్రోపో ఆవరణంలో దక్షిణ, నైరుతి గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర కోస్తా ఆంధ్ర, యానాంలలో ఈరోజు, రేపు, ఎల్లుండి వివిధ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముందని తెలిపింది. దక్షిణ కోస్తా ఆంధ్రలో పొడి వాతావరణం, అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురవనున్నాయి. రాయలసీమలో ఈరోజు, రేపు, ఎల్లుండి వాతావరణం పొడిగా ఉండే అవకాశముంది.
0 Comments:
Post a Comment