Proteins : మధుమేహంతో బాధపడుతున్న వారి సంఖ్య ప్రపంచ వ్యాప్తంగా రోజురోజుకు పెరుగుతుంది.
ప్రపంచంలో మధుమేహంతో బాధపడుతున్న ఉన్నవారి సంఖ్యలో భారత దేశం రెండవ స్థానంలో ఉంది.
అయితే చాలా మందికి తమకు మధుమేహం ఉన్న విషయం కూడా తెలియటం లేదు. కనీస పరీక్షలు లేకపోవటంతో తాము మధుమేహాం బారిన పడ్డామన్న విషయాన్ని వారు గ్రహించలేకపోతున్నారు.
కోవిడ్ నేపధ్యంలో చాలా మంది ఊబకాయం, అధిక బరువు వంటి సమస్యల బారిన పడి మధుమేహాన్నికొని తెచ్చకున్నారు. అయితే మధుమేహాన్ని నియంత్రించటంలో రోజు మనం తీసుకునే ఆహారం సైతం ఎంతో దోహదం చేస్తుందని అంటున్నారు నిపుణులు.
ఆహారంలో పోషక విలువలు తగ్గకుండా చూసుకుంటే మధుమేహాన్ని నియంత్రణలో ఉంచవచ్చని సూచిస్తున్నారు.
ప్రోటీన్ అనేది అత్యంత బహుముఖ స్థూల పోషకం మరియు మన దైనందిన జీవితంలో అనేక ముఖ్యమైన పాత్రలను కలిగి ఉంది. ప్రొటీన్లు జీర్ణప్రక్రియకు అవసరమయ్యే పీచు పదార్ధాలు రక్తంలో షుగర్ లెవెల్స్‌ను పెరగకుండా చూస్తాయి.
మధుమేహం ఉన్న వ్యక్తులలో రోగనిరోధక శక్తిని మెరుగుపరచడంలో ప్రోటీన్‌లు కూడా కీలక పాత్ర పోషిస్తాయి. ప్రొటీన్లు మంచి సంతృప్తిని అందించి ఆకలి నియంత్రణలో ఉంచేందుకు సహాయపడతాయి.
రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను నియంత్రించడంలో మరియు HBA1cని తగ్గించడంలో సహాయపడుతుంది.
ప్రొటీన్ రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను పెంచకుండా ఇన్సులిన్ ప్రతిస్పందనను పెంచుతుంది.
కార్బోహైడ్రేట్‌లు లేదా స్టార్చ్‌తో మొదట ప్రోటీన్‌ను తీసుకుంటే, భోజనం తర్వాత రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు మెరుగ్గా ఉంటాయని అధ్యయనాలు చెబుతున్నాయి.
దీని వల్ల బరువు నిర్వహణ కూడా ఈజీగా ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు.
గుడ్లు, లీన్ మీట్, చేపలు, పెరుగు, మజ్జిగ, పనీర్, మొలకలు, పప్పు, సోయాబీన్, సోయా చంక్స్, సోయా గ్రాన్యూల్స్, నట్స్ వంటి ప్రొటీన్లు అధికంగా ఉండే ఆహారాలను ఆహారంలో చేర్చడం ద్వారా షుగర్ ను కంట్రోల్ లో ఉంచుకోవచ్చు.
గమనిక; ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. మధుమేహం ఉన్నవారు వైద్యుల సూచనలు, సలహాలు పాటించటం ద్వారా తగిన చికిత్స పొందగలరు.
0 Comments:
Post a Comment