పదవ తరగతి ప్రీ ఫైనల్ పరీక్షా పత్రాలను చట్ట విరుద్ధంగా పరీక్షకు ముందుగా యూట్యూబ్ లో పెడుతున్న అనుమానితుని వివరాలను విజయవాడ సైబర్ క్రైం పోలీసులు కనిపెట్టారని అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు పాటశాల విద్యా శాఖా కమీషనర్
S సురేష్ కుమార్ ఐఏఎస్ ఒక ప్రకటనలో తెలిపారు.
ప్రశ్నా పత్రాలు అప్లోడ్ చేస్తున్న అనుమానితుడు కడపకు చెందిన అతనుగా గుర్తించినట్లు ఆయన వివరించారు.
రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్ధులకు ఉమ్మడి ప్రశ్న పత్రం ద్వారా పరీక్షలు నిర్వహిస్తున్న విషయాన్ని ఆయన గుర్తుచేస్తూ ప్రశ్న పత్రాలను సమయానికంటే ముందుగా బహిర్గతం చేయడం లేదా సామాజిక మాధ్యమాలలో పెట్టడం పరీక్ష నిర్వహణా చట్టాలకు విరుద్దమని, వారిపై క్రిమినల్ చర్యలు తీసుకునే అవకాశం ఉందని, ఈ మేరకు కడప పోలిస్ స్టేషన్ లో జిల్లా విద్యాశాఖ అధికారులు పిర్యాదు చేసినట్లు తెలిపారు.
ప్రశ్న పత్రాల ముద్రణ జిల్లా కామన్ పరీక్షల బోర్డ్ ల ఆధ్వ్యర్యంలో జరుగుతాయి కనుక అన్ని జిల్లాలలో కేసులు నమోదు చేయించినట్లు కమీషనర్ వివరించారు.ఇక ముందు కూడా జిల్లా విద్యా శాఖ అధికారులు ఎప్పటికప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు.
0 Comments:
Post a Comment