Post Office Schemes: పెట్టుబడి తక్కువ, లాభం ఎక్కువ..15 వందలతో 35 లక్షలు, ఎలాగంటే..
Post Office Schemes: మన సమీపంలో ఉండే పోస్టాఫీసుల్లో మనకు తెలియని చాలా పథకాలుంటాయి. కొన్ని సాధారణమే అయినా..కొన్నిమాత్రం లాభాలు ఆర్జిస్తాయి.
కేవలం 15 వందల పెట్టుబడితో..35 లక్షల వరకూ సంపాదించే మార్గం తెలుసుకుందాం.
కష్టపడి సంపాదించి డబ్బును ఎక్కడైనా పెట్టుబడి పెడితే బాగుంటుందనేది ప్రతి మధ్య తరగతి వ్యక్తి ఆలోచన. సరైన మార్గంలో మీరు పెట్టే పెట్టుబడి మీ భవిష్యత్‌ను సంరక్షిస్తుంది. మార్కెట్‌లో చాలా రకాల పెట్టుబడి మార్గాలు, ప్రణాళికలు అందుబాటులో ున్నాయి. కానీ ప్రతి ఒక్క పెట్టుబడిలో రిస్క్ తప్పనిసరిగా ఉంటుంది. అయితే ఏ మాత్రం రిస్క్ లేకుండా మీ పెట్టుబడికి కచ్చితమైన లాభాల్ని తెచ్చిపెట్టే ఇన్వెస్ట్‌మెంట్ కూడా ఉంది. అదే పోస్టాఫీసు ఇన్వెస్ట్‌మెంట్ స్కీమ్. పెట్టుబడి ప్రణాళికలు చేసేవారికి ఇదొక అద్భుత అవకాశం. మంచి మార్గం. ఇందులో కేవలం 15 వందల రూపాయల పెట్టుబడితో 35 లక్షల వరకూ సంపాదించవచ్చు.
ఈ స్కీమ్ పేరు గ్రామ్ సురక్షా పథకం. మీరు 19 ఏళ్లలోపువారైతే ఇది మీకు మంచి పథకం కానుంది. అదే సమయంలో 19 నుంచి 55 ఏళ్ల వరకూ ఈ స్కీమ్‌లో చేరవచ్చు. వాస్తవానికి పోస్టాఫీసులో చాలా రకాల ఇన్వెస్ట్‌మెంట్ అవకాశాలున్నాయి కానీ ఇది మాత్రం మంచి పథకమంటున్నారు మార్కెట్ విశ్లేషకులు. 19 ఏల్ల వయస్సువారికి చాలా ఉపయోగమంటున్నారు.
19 వయస్సులో మీరు ఇన్వెస్ట్‌మెంట్ ప్రారంభిస్తే..మీ నెలసరి వాయిదా కేవలం 1515 రూపాయలు మాత్రమే. అది 55 ఏళ్ల వరకూ కట్టాల్సి ఉంటుంది. 58 ఏళ్ల వరకైతే 1463 రూపాయలు, 60 ఏళ్ల వరకైతే 1411 రూపాయలు కట్టాలి. గ్రామ సురక్ష పథకం ప్రకారం 55 ఏళ్ల తరువాత పెట్టుబడి పెట్టిన వ్యక్తి లేదా పాలసీదారుడికి మెచ్యూరిటీ కింద 31.60 లక్షల రూపాయలు చేతికి అందుతాయి. అదే వ్యక్తి 58 ఏళ్ల పాటు పెట్టుబడి పెడితే.. అనంతరం 33.40 లక్షల రూపాయలు అందుతాయి. 60 ఏళ్ల పాటు కొనసాగితే మెచ్యూరిటీ బెనిఫిట్ 34.60 లక్షలు అందుతాయి. ఈ స్కీమ్‌లో కనీస లాభం పదివేల నుంచి పది లక్షల వరకూ ఉంటుంది. ఒకవేళ పెట్టుబడిదారుడు మరణిస్తే..మెచ్యూరిటీ మొత్తం నామినా లేదా లీగల్ హెయిర్‌కు అందుతుంది.
ఈ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ ప్రకారం ప్రీమియం నెలకు, మూడు నెలలకు, ఆరు నెలలకు లేదా ఏడాదికోసారి చెల్లించవచ్చు. ఒకవేళ ఏదైనా అత్యవసరమైతే నెలరోజుల గ్రేస్ పీరియడ్ ఉంటుంది. ఒకవేళ మూడేళ్ల తరువాత వినియోగదారుడు లేదా పెట్టుబడిదారుడు ఇన్సూరెన్స్ నిలిపివేయాలనుకుంటే ఆ అవకాశముంటుంది. అయితే అలా చేస్తే ఏ విధమైన బెనిఫిట్స్ చేతికి అందవు. అత్యవసమైతే తప్ప అలా చేయవద్దనే పోస్టల్ డిపార్ట్‌మెంట్ సూచిస్తోంది. వ్యక్తిగత సమాచారం, ఈ మెయిల్, చిరునామా, ఫోన్ నెంబర్, నామినీ వంటివి మార్చే సౌలభ్యముంటుంది. అవసరాన్ని, సందర్భాన్ని బట్టి ఎంచుకోవల్సి ఉంటుంది.
0 Comments:
Post a Comment