Special portal for pensioners
✍️పెన్షనర్ల కోసం కేంద్రం ప్రత్యేక పోర్టల్ కేంద్రం
🌻న్యూఢిల్లీ, ఏప్రిల్ 12: దేశంలోని పెన్షనర్లు, రిటైరయిన సీనియర్ సిటిజన్ల సౌకర్యార్థం ప్రత్యేకంగా పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకురానున్నట్టు కేంద్ర సిబ్బంది వ్యవహారాలు, పెన్షన్ల శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ వెల్లడించారు. దేశవ్యాప్తంగా ఉన్న పెన్షనర్లు, వారికి సంబంధించిన అసోసి యేన్లతో సంప్రదింపులు జరపడానికి, వారి నుంచి సూచనలు, సలహాలు తీసుకోవడానికి పోర్టల్‌ను రూపొందించనున్నట్టు తెలిపారు. అలాగే పెన్ష నర్లు తమ సమస్యలనూ పోర్టల్ ద్వారా అధికారులకు తెలిపే అవకాశం ఉంటుందని చెప్పారు. పెన్షనర్లకు సంబంధించిన అన్ని అంశాలతో సింగిల్ విండో పోర్టల్ దీన్ని తీసుకురానున్నట్టు తెలిపారు. పెన్షనర్లతో సంబంధం ఉన్న అన్ని ప్రభుత్వ శాఖలను దీనితో అనుసంధానం చేస్తామని, తద్వారా పెన్షనర్లు ఆయా విభాగాలకు వెళ్లాల్సిన అవసరం ఉండదన్నారు. ఫిర్యాదుల పరిష్కారానికి ఒక నోడల్ ఆఫీసర్ కూడా ఉంటారని చెప్పారు.
0 Comments:
Post a Comment