Rc. No. 24/A&I/2022
Sub:- Dated: 24/04/2022 School Education – School Academic Calendar – 2021 – 22 Functioning of Schools during the academic year 2021-22 – Not to sanction any kind of leaves to the Headmasters/ Teachers during the period from 25th April to 20th May, 2022 - Instructions - Issued.
May 20 వరకు ఏ ఉద్యోగికి ఎటువంటి సెలవు ఇవ్వకూడదు (మెడికల్ కారణం/ ఆధారం పై తప్ప).
మే నెల లో పాఠశాలలుకు సెలవు దినాలు
పనిదినాలు:16 రోజులు
1️⃣01-05-2022- *ఆదివారం.*
2️⃣03-05-2022- *రంజాన్*.
3️⃣08-05-2022- *ఆదివారం*.
4️⃣15-05-2022- *ఆదివారం
స్కూల్స్ కి సెలవులు.
21-05-2022 నుండి 03-జూలై-2022 వరకు.
పాఠశాలల పునఃప్రారంభం
🔹 జూలై-04.(సోమవారం)
🔳టీచర్లకు సెలవులు రద్దు
నేటి నుంచి మే 20 తేదీ వరకూ అత్యవసర వైద్య కారణాలైతే తప్ప
సీఎల్, ఈఎల్ లాంటివి పెట్టరాదు.. విద్యా శాఖ కమిషనర్ ఉత్తర్వులు ఉపాధ్యాయ సంఘాల మండిపాటువిద్యార్థులకు వర్షాకాలంలోనూ సెలవులువచ్చే ఏడాది సిలబ్‌సపై ప్రభావం.. ప్రభుత్వ వైఖరిపై తీవ్ర విమర్శలు
అమరావతి, ఏప్రిల్ 24 (ఆంధ్రజ్యోతి): విద్యా శాఖ నిర్ణయాలపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఎండలను దృష్టిలో పెట్టుకుని మార్చి 15 నుంచి నిర్వహించాల్సిన ఒంటిపూట బడులను ఏప్రిల్‌లో పెట్టారు. వేసవి సెలవులనేమో మే 6 నుంచి వర్షం కాలంలో జూలై 3 వరకు ప్రకటించారు. సాధారణంగా వేసవి సెలవులు 45 రోజులు ఇచ్చేవారు. ఈ ఏడాది సుమారు 60 రోజుల ఇచ్చారు. ఆలస్యంగా విద్యా సంవత్సరం ప్రారంభించడం వల్ల సిలబస్ పూర్తి చేయడంపై ప్రభావం పడే అవకాశముంది. మరోవైపు ఉపాధ్యాయులు మాత్రం మే 20 వరకు పనిచేయాలనే నిబంధన పెట్టారు. తాజాగా ఈ నెల 25 నుంచి మే 20 వరకు ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు ఏవిధమైన సెలవులు పెట్టకూడదని ఆదేశించారు. ఆదివారం విద్యా శాఖ కమిషనర్ సురేశ్ కుమార్ దీనిపై ఉత్తర్వులిచ్చారు. ప్రాంతీయ, జిల్లా విద్యాశాఖాధికారులు దీనిపై పర్యవేక్షించాలని నిర్దేశించారు. సాధారణంగా పదోతరగతి, ఇతర తరగతుల పరీక్ష పత్రాలు దిద్దేందుకు ఉపాధ్యాయులకు కొంత సమయం పడుతుంది. ఆ సమయంలో వారు పనిచేస్తుంటారు. పదో తరగతి పరీక్ష మూల్యాంకనం చేయాల్సిన ఉపాధ్యాయులు దానికి హాజరవుతారు. మిగతావారు ఒకటి నుంచి తొమ్మిదో తరగతి వరకు సమ్మేటివ్ పరీక్ష పత్రాలు మూల్యాంకనం చేస్తారు. ఇది ఏటా జరిగే ప్రక్రియే. అయితే ఈ ఏడాది ఈ నెల 25 నుంచి మే 20 వరకు టీచర్లు అసలు సెలవులే పెట్టకూడదని ఉత్తర్వులివ్వడంపై విమర్శలు వస్తున్నాయి. కేవలం అత్యవసర వైద్య కారణాలతో తప్ప సీఎల్, ఈఎల్ లాంటివి పెట్టకూడదని ఆదేశించారు. సెలవులను రద్దు చేస్తూ ఉత్తర్వులు ఇవ్వడం సరికాదని ఉపాధ్యాయ సంఘాలు పేర్కొంటున్నాయి. ఈ నిర్బంధ ఉత్తర్వులను రద్దు చేయాలని ఏపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చెన్నుపాటి మంజుల, కె.భానుమూర్తి, మరో ఏపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు హృదయరాజు, కులశేఖర్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఉపాధ్యాయులపై పగ తీర్చుకొనే సాధనంగా వేసవి సెలవులను జగన్‌రెడ్డి వాడుతున్నారని టీడీపీ నేత, మాజీ మంత్రి కేఎస్ జవహర్ విమర్శించారు. వెకేషన్, నాన్‌వెకేషన్ డిపార్ట్‌మెంట్లకు జగన్‌కు తేడా తెలియదని ఎద్దేవా చేశారు.
0 Comments:
Post a Comment