నమ్మండి... ఈయన తహసిల్దారే
చిత్రంలో వ్యక్తిని చూశారా.... ద్విచక్ర వాహనంపై రెండు డబ్బాలతో నీటిని తీసుకువెళ్తున్న ఇతను ఓ మండలానికి తహసిల్దారు. అంటే నమ్ముతారా..? అవునండి ఇది నిజం... ఇతను నక్కపల్లి తహసిల్దారు జగన్నాథరావే. ఎస్.రాయవరం మండలం అడ్డురోడ్డులో ఇతను నివాసం. ఉంటున్నారు. వీరు ఉంటున్న ప్రాంతంలో తాగునీటి సరఫరా లేకపోవడంతో ఇతనే స్వయంగా ద్విచక్రవాహనంపై రోజూ తన ఇంటి అవసరాలకు కావాల్సిన నీటిని గ్రామ శివారుకు వెళ్లి తెచ్చుకుంటున్నారు. తహసిల్దారు అంటే మండలానికి మెజిస్ట్రేట్, మండలంలో మొత్తం రెవెన్యూ యంత్రాంగమంతా. ఆయన చేతుల్లోనే ఉంటుంది. గ్రామాల్లో పని చేసే వీఆర్ఎలకు సైతం ఆయన మాట వేదవాక్కు. చిన్నస్థాయి ఉద్యోగులు సైతం ఎంతో దర్పంగా జీవిస్తున్న ఈ రోజుల్లో ఇతను తన అధికారాన్ని కానీ, కిందస్థాయి సిబ్బందిని కానీ తన సొంత అవసరాలకు వినియోగించుకోవడం లేదు. ద్విచక్ర వాహనంపై నీటిని తెచ్చుకుంటున్న తహసిల్దారు 'న్యూస్టుడే' కంట పడ్డారు.
న్యూస్ టుడే, అడ్డురోడ్డు
0 Comments:
Post a Comment