Joyalukkas: అక్షయ తృతీయ రాబోతోంది. పలు ఆఫర్లు అందుబాటులోకి వస్తాయి. ఇక మే 3వ తేదీన అక్షయ తృతీయను పురస్కరించుకుని జోయాలుక్కాస్ జువెలరీ ప్రత్యేకమైన క్యాష్‌బ్యాక్ ఆఫర్లను ప్రకటించింది.
అక్షయ తృతీయ (Akshaya Tritiya) సందర్భంగా ఆభరణాలు కొనుగోలు చేసిన వినియోగదారులకు ప్రత్యేకంగా గిఫ్ట్ వోచర్స్‌ను అందించనున్నట్లు యాజమాన్యం వెల్లడించింది. ఈ నెల 22 నుంచి మే 3వ తేదీ వరకు ఈ ఆఫర్ దేశవ్యాప్తంగా ఉన్న అన్ని షోరూమ్‌లలో అందుబాటులో ఉంటుందని జోయాలుక్కాస్ తెలిపింది.
రూ.50,000, అంతకుపైబడిన వజ్రాలు, అన్‌కట్ వజ్రాలు, విలువైన బంగారు ఆభరణాలు కొనుగోలు చేసిన వినియోగదారులకు రూ.2,000 విలువైన గిఫ్ట్ వోచర్‌ను ఇవ్వనున్నట్లు పేర్కొంది. రూ.50,000, అంతకు పైబడిన బంగారు ఆభరణాలు కొనుగోలు చేసిన వారికి రూ.1,000 విలువ గల గిఫ్ట్ వోచర్, రూ.10,000 విలువైన వెండి ఆభరణాలు కొనుగోలు చేసిన కస్టమర్లకు రూ.500 విలువైన గిఫ్ట్ వోచర్‌ను ఇవ్వనున్నట్లు తెలిపింది. ఎస్‌బీఐ డెబిట్, క్రెడిట్ కార్డు ద్వారా ఆభరణాలు కొనుగోలు చేసిన కస్టమర్లకు అదనంగా 5 శాతం డిస్కౌంట్‌ను ఆఫర్ చేస్తున్నట్లు పేర్కొంది. బైబ్యాక్ గ్యారంటీతో పాటు జోయాలుక్కాస్‌లో కొనుగోలు చేసిన ఆభరణాలకు సంవత్సరం పాటు ఉచిత బీమా, లైఫ్‌టైమ్ ఉచిత మెయింటెనెన్స్‌ను ఆఫర్ చేస్తున్నట్లు తెలిపింది.
0 Comments:
Post a Comment