Jobs: రాతపరీక్ష లేకుండా 1,625 ఉద్యోగ ఖాళీలు.. నెలకు రూ.24,780 వేతనంతో?
Jobs: ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. 1625 జూనియర్ టెక్నీషియన్ ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ సంస్థ నుంచి జాబ్ నోటిఫికేషన్ రిలీజైంది.
ఏప్రిల్ 1వ తేదీన ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైందని తెలుస్తోంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఏప్రిల్ 11వ తేదీ లోపు ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకునే ఛాన్స్ ఉంటుంది.
ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు నెలకు రూ.20,480 నుంచి రూ. 24,780 వరకు వేతనం లభించనుంది. 30 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న అభ్యర్థులు మాత్రమే ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవడానికి అర్హత కలిగి ఉంటారని సమాచారం అందుతోంది. https://careers.ecil.co.in/login.php వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు.
మొత్తం 1625 ఉద్యోగ ఖాళీలలో ఎలక్ట్రానిక్స్ మెకానిక్ ఉద్యోగ ఖాళీలు 814 ఉండగా ఈ ఉద్యోగాలకు ఎంపికైన వాళ్లకు రూ. 20,480 వేతనంగా లభించనుందని సమాచారం అందుతోంది. ఎలక్ట్రిషియన్ పోస్టులు 184 ఉండగా ఈ ఉద్యోగాలకు ఎంపికైన వాళ్లకు రూ. 22,528 వేతనంగా లభించనుందని బోగట్టా. ఫిట్టర్ ఉద్యోగ ఖాళీలు 627 ఉండగా ఈ ఉద్యోగాలకు ఎంపికైన వాళ్లకు రూ. 24,780 వేతనంగా లభించనుంది.
ఎలక్ట్రానిక్స్ మెకానిక్ /ఎలక్ట్రీషియన్ /ఫిట్టర్ ట్రేడ్‌లో ఏదైనా యూనివర్సిటీ నుంచి ఐటీఐ సర్టిఫికెట్ ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హత కలిగి ఉంటారు. https://careers.ecil.co.in/login.php వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. ఆన్ లైన్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరగనుందని సమాచారం అందుతోంది.
0 Comments:
Post a Comment