🔳జేఈఈ మెయిన్ మళ్లీ వాయిదా
జూన్ 20-29 మధ్య మొదటి సెషన్జూలై 21-30 మధ్య రెండో సెషన్జూలై 17న నీట్ యూజీ పరీక్షనీట్కు గరిష్ఠ వయోపరిమితి ఎత్తివేత
న్యూఢిల్లీ, ఏప్రిల్ 6: జేఈఈ మెయిన్ పరీక్ష మరోసారి వాయిదాపడింది. ఏప్రిల్-మే నెలల్లో నిర్వహించాల్సిన మొదటి సెషన్ పరీక్షను జూన్ నెలకు వాయిదావేశారు. అలాగే మే నెలలో జరగాల్సిన సెకండ్ సెషన్ పరీక్షను జూలై నెలకు వాయిదావేశారు. కొత్త షెడ్యూల్‌ను అనుసరించి... జేఈఈ మెయిన్ మొదటి సెషన్ పరీక్ష జూన్ 20 నుంచి 29 వరకు జరగనుంది. సెకండ్ సెషన్ పరీక్షను జూలై 21 నుంచి 30 వరకు నిర్వహిస్తారు. ఈ మేరకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) బుధవారం కొత్త షెడ్యూల్‌ను వెల్లడించింది. మొదటి సెషన్ పరీక్షకు దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ముగిసింది. రెండో సెషన్‌కు దరఖాస్తు తేదీలను త్వరలో ప్రకటించనున్నట్టు ఎన్టీఏ తెలిపింది. నీట్ (యూజీ) 2022 నోటిఫికేషన్‌ను కూడా ఎన్టీఏ బుధవారం విడుదల చేసింది.జూలై 17న దేశవ్యాప్తంగా ఆఫ్‌లైన్‌లో పరీక్ష జరగనుంది. ఈసారి నీట్ పరీక్షకు దరఖాస్తు చేసుకోవడానికి గరిష్ఠ వయోపరిమితిని తొలగించారు. ఆన్లైన్ రిజిస్ర్టేషన్ ప్రక్రియ ఏప్రిల్ 6 నుంచే ప్రారంభమైంది. మే నెల 6 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఓపెన్ స్కూల్, ప్రైవేట్ అభ్యర్థులు నీట్‌కు అనర్హులు. ఇంగ్లీష్, హిందీ, తెలుగు సహా మొత్తం 13 భాషల్లో నీట్ ప్రశ్నాపత్రాన్ని రూపొందిస్తారు. దరఖాస్తు సమయంలోనే అభ్యర్థులు ప్రశ్నాపత్రం లాంగ్వేజ్‌ను ఎంచుకోవాలి. ఆ తర్వాత దీన్ని మార్చుకునే వీలుండదు. గతేడాది మాదిరిగానే ఈసారి కూడా నీట్ (యూజీ)లో ఆప్షనల్ ప్రశ్నలు ఉంటాయని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ప్రకటించింది. దీన్ని అనుసరించి... సెక్షన్-బిలో ఇచ్చే 15 ప్రశ్నల్లో ఏవైనా 10 ప్రశ్నలకు సమాధానాలు గుర్తిస్తే సరిపోతుంది. మరిన్ని వివరాలు ఎన్టీఏ వెబ్సైట్లో లభిస్తాయు
0 Comments:
Post a Comment