ఐటీ రిటర్నులకు వేళాయె
ఆర్థిక సంవత్సరం ముగిసింది. ఆదాయం పన్ను (ఐటీ) అసెస్మెంట్కు సమయం వచ్చింది. వచ్చే నాలుగు నెలల్లో రిటర్న్‌లను దాఖలు చేయాల్సి ఉంటుంది. చివరి నిమిషంలో ఐటీ కన్సల్టెంట్ల వద్ద హడావిడి సహజం.
అయితే ఆదాయాలపై పూర్తి అవగాహన ఉంటే ముందుగానే పన్ను చెల్లించవచ్చు. సాధారణంగా ఆర్థిక సంవత్సరం తర్వాత పన్ను దాఖలు, చెల్లింపులు జరుగుతాయి. ఇలాకాకుండా ఓ ఆర్థిక సంవత్సరంలోనే దానికి సంబంధించిన పన్నును ముందుగా చెల్లించడాన్ని అడ్వాన్స్ ట్యాక్స్ అంటారు. దీన్నే సంపాదించిన వెంటనే పన్ను చెల్లించడం అని కూడా అంటారు. సాధారణంగా టీడీఎస్‌ల మినహాయింపు తర్వాత రూ.10,000 మించి వచ్చే ఆదాయాలపై అడ్వాన్స్ టాక్స్‌లను చెల్లించవచ్చు. వచ్చిన ఆదాయాలకై త్రైమాసికాలవారీగా జూన్ 15లోగా 15%, సెప్టెంబర్ 15లోగా 45%, డిసెంబర్ 15లోగా 75%, మార్చి 15లోగా 100% పన్నును చెల్లించవచ్చు. ఆ తర్వాత రిటర్న్‌లను దాఖలు చేసేటప్పుడు వీటిన్నింటినీ పేర్కొనవచ్చు.
చెల్లించడం ఎలా?
ఐటీ శాఖ ఇందుకోసం చలాన్ 28ని జారీ చేసింది. దీన్ని https://onlineservices.tin.egov-nsdl.com/etaxnew/tdsnontds.jsp అనే లింక్‌ను క్లిక్ చేసి పొందవచ్చు. ఆన్లైన్లోనే చెల్లించడం వల్ల వెంటనే రశీదు కూడా వస్తుంది. చెల్లించేటప్పుడు అసెస్మెంట్ సంవత్సరాన్ని సరిగ్గా పేర్కొనండి. నెట్ బ్యాంకింగ్ లేదా డెబిట్ కార్డుతోనూ చెల్లించవచ్చు. రశీదును డౌన్లోడ్ చేసుకుని భవిష్యత్తు రిఫరెన్స్‌ల కోసం భద్రపర్చండి.
0 Comments:
Post a Comment