ISRO Recruitment: ఇస్రోలో ఉద్యోగ అవకాశాలు.. అర్హతలు అప్లికేషన్ విధానం..
భారత ప్రభుత్వ అంతరిక్ష విభాగానికి చెందిన ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (Indian Space Research Organisation)లో పలు పోస్టుల భర్తీకిన నోటిఫికేషన్ (Notification) విడుదల అయ్యింది.
ఈ నోటిఫికేషన్ ద్వారా రీసెర్చ్ విభాగంలో 20 ఖాళీలలను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు దరఖాస్తు అవసరం లేదు. ఎటువంటి రాత పరీక్ష లేకుండా నేరుగా వాక్ఇన్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఎంపికకూన అభ్యర్థులకు నెలకు రూ.31,000 నుంచి రూ.56,100 వరకు వేతనం అందిస్తారు. నోటిఫికేషన్, వాక్ ఇన్ వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్ https://www.iirs.gov.in/ ను సందర్శించాలి.
పోస్టుల వివరాలు..
పోస్టు ఖాళీలు
జూనియర్ రిసెర్చ్ ఫెలో 16
రిసెర్చ్ అసోసియేట్ 03
రిసెర్చ్ సైంటిస్ట్ 01
అర్హతలు..
ఇస్రోలోని పోస్టులను అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్, ఎమ్మెస్సీ, ఎంఈ/ ఎంటెక్, ఎంప్లాన్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అంతే కాకుండా.. నెట్/గేట్/ఐఐఆర్ఎస్-జెట్ లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఇంటర్వ్యూకు హాజరు అయ్యే అభ్యర్థుల వయసు 28 ఏళ్ల నుంచి 35 వయసు ఉండాలి.
ఎంపిక విధానం..
- ముందుగా అర్హత గల అభ్యర్థులు సంబంధిత తేదీల్లో ఇంటర్వ్యూలకు హాజరు కావాలి.
- ఇంటర్వ్యూ, మెరిట్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
ముఖ్యమైన సమాచారం..
- ముందుగా అధికారిక వెబ్‌సైట్ https://www.iirs.gov.in/ ను సందర్శించాలి.
- నోటిఫికేషన్ వివరాలు పూర్తిగా చదవాలి. (నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి)
- అర్హతలకు సంబంధించిన ధ్రువపత్రాలను తీసుకొని ఇంటర్వ్యూకు హాజరు కావాలి.
- ఇంటర్వ్యూ తేదీలు.. ఏప్రిల్ 14, 2022 నుంచి ఏప్రిల్ 22, 2022 వరకు అవకాశం ఉంది.
ఇంటర్వ్యూ వేదిక
IIRS Security Reception,
IIRS, ISRO/DOS 4 Kalidas Road,
Dehradun-248001
0 Comments:
Post a Comment