Inspiration -Ganga ghats for Free Coaching : టీచర్ గా మారిన ఇంజినీర్..గంగా ఘాట్ వద్ద పేద విద్యార్థులకు ఫ్రీ కోచింగ్...
Ganga ghats for free coaching : ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమయ్యే అభ్యర్థుల కోసం నదీతీరాన్నే ఓపెన్ క్లాస్రూంగా మార్చేశారు. బీహార్ రాజధాని పాట్నా(Patna)లో ఉన్న గంగా ఘాట్(Ganga Ghat)...ప్రస్తుతం విద్యార్థులకు స్టడీ ఘాట్ (Study Ghat)గా మారిపోయింది. వారాంతాల్లో ఇక్కడకు వందలాది మంది విద్యార్థులు(Students) చేరుకుని పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు. ఇక్కడ వారాంతాల్లో ఉచితంగా కోచింగ్ ఇస్తుండటంతో...బీహార్ తో పాటు ఉత్తరప్రదేశ్, రాజస్తాన్ నుంచి కూడా పెద్ద సంఖ్యలో అభ్యర్థులు ఇక్కడికి వస్తున్నారు. ఎస్ కే ఝా అనే ఇంజినీర్ ఉపాధ్యాయుడిగా మారి.. వారానికి రెండుసార్లు వీరందరి నుంచి ఎలాంటి రుసుం తీసుకోకుండానే క్లాసులు చెబుతున్నారు. ఉద్యోగాలకు ఎలా సన్నద్ధమవ్వాలనే విషయంపై మార్గదర్శనం చేస్తున్నారు. ఎస్ కే ఝా చెప్పే విషయాలు ప్రభుత్వ ఉద్యోగానికి సిద్ధమయ్యేందుకు విశేషంగా ఉపయోగపడుతున్నాయని విద్యార్థులు చెబుతున్నారు.
ఉచితంగా క్లాసులు చెప్పడమే కాకుండా..అభ్యర్థులకు పరీక్షలు నిర్వహిస్తున్నారు. 30-35 మందితో కూడిన బృందం . ఎస్ కే ఝాకు సహాయం అందిస్తోంది. ప్రస్తుతం దాదాపు 12 నుంచి 14 వేల మంది అభ్యర్థులు పాఠాలు వినేందుకు వస్తారని ఝా చెబుతున్నారు. వీరంతా ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులేనని, ఆర్ఆర్బీ ఎన్టీపీసీ, యూపీఎస్సీ సహా వివిధ పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్నట్టు పేర్కొన్నారు. ఓ విద్యార్థి మాట్లాడుతూ..రోజు ఉదయం 6గంటలకు ఇక్కడికి వస్తాను. 120 ప్రశ్నలతో కూడిన క్వశ్చన్ పేపర్ ఇస్తారు. 90 నిమిషాల సమయంలో దీన్ని పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ పరీక్షలు మాకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి అని తెలిపారు.
మరోవైపు, తెలంగాణ(Telangana) సర్కారు రాష్ట్రంలో కొలువుల జాతర షురూ చేసింది. ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు(Notifications) జారీ చేసింది. ఇలాంటి పరిస్థితుల్లో పేద, మధ్యతరగతి యువత, విద్యార్ధుల కోసం మరికొందరు మహానుభావులు ఉద్యోగాలకు అవసరమైన కోచింగ్ సెంటర్(Coaching Center)లను ఉచితంగా పలు జిల్లాల్లో నెలకోల్పుతున్నారు. టెట్Tet, డీఎస్సీDSC,కి ప్రివేర్ అయ్యే వాళ్లతో పాటు ఉద్యోగవకాశాలు తమ ప్రాంతాల్లోని యువతకు, విద్యార్దులకు దక్కాలనే మంచి ఆలోచనతో తమ తల్లిదండ్రులు, పూర్వికుల జ్ఞాపకార్ధం ఉచిత కోచింగ్ సెంటర్(Free coaching centers)లు ఏర్పాటు చేస్తున్నారు. ముఖ్యంగా మహబూబ్నగర్ (Mahabubnagar)జిల్లాలో స్థానిక నియోజకవర్గ ఎమ్మెల్యేలు, మంత్రులు ఇలాంటి ఫ్రీ కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేని పేద, నిరుద్యోగ యువతకు మంచి మేలు చేస్తున్నారు
0 Comments:
Post a Comment