Search This Blog

Monday, 25 April 2022

Inspiration - కళ్లు కనిపించకపోయినా గోల్డ్ మెడల్​.. 75 ఏళ్ల వయసులో పీహెచ్​డీ

 కళ్లు కనిపించకపోయినా గోల్డ్ మెడల్​.. 75 ఏళ్ల వయసులో పీహెచ్​డీ..

అన్ని రకాల సదుపాయాలు, అవయవాలు ఉండికూడా విద్యను నిర్లక్ష్యం చేస్తున్న ఈ రోజుల్లో.. కళ్లు కనపడకున్నా కష్టపడి చదువుకొని బంగారు పతకాన్ని సాధించాడు కర్ణాటకకు చెందిన అన్విత్​ కుమార్​.

విశ్వవిద్యాలయ చరిత్రలోనే అత్యధిక మార్కులు సంపాదించిన విద్యార్థిగా నిలిచి ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నాడు​. మరోవైపు.. 75 ఏళ్ల వయసులో పీహెచ్​డీ పూర్తి చేశారు ఓ మహిళ.

Visually Impaired Student Got A Gold Medal: చదువుకోవాలనే దృఢ సంకల్పం ఉంటే ఎలాంటి అవరోధాలు ఎదురైనా లక్ష్యాన్ని చేరుకోగలమని నిరూపించాడు ఓ అంధ విద్యార్థి. కర్ణాటక మంగళూరు కుంబాలకు చెందిన అన్విత్​ కుమార్​ దృష్టి లోపంతో బాధపడుతున్నాడు. అయినా నిరాశ పడకుండా చదివి​ పోస్ట్​ గ్రాడ్యుయేషన్​లో గోల్డ్ మెడల్ సాధించాడు. మంగళూరు విశ్వవిద్యాలయం నుంచి రాజకీయ శాస్త్రంలో అత్యధిక స్కోరు సంపాదించిన విద్యార్థిగా నిలిచాడు.

 గోల్డ్​ మెడల్​ సాధించిన అన్విత్​ కుమార్

అన్విత్ ఆరో తరగతిలో ఉండగా.. తన రెండు కళ్లను పోగొట్టుకున్నాడు. ఆ తర్వాత అతడి తల్లి చదువుకోవాలని ఎంతగానో ప్రోత్సహించింది. ఫలితంగా ప్రతి తరగతిలోనూ మెరుగైన మార్కులు సాధించాడు. పదో తరగతి వరకు బ్రెయిలీ లిపి​లో చదువుకున్న అన్విత్​.. తర్వాత సాధారణంగానే విద్యను అభ్యసించాడు. అతడికి తల్లితోపాటు సహచర విద్యార్థులు, అధ్యాపకులు అండగా నిలిచారు. సహాయకులతో పరీక్షలకు హాజరైన అన్విత్​.. పదో తరగతిలో 87శాతం, పీయూసీలో 88 శాతం, బీఏలో 89 శాతం, ఎంఏలో 82 శాతం మార్కులు పొందాడు. బీఏ, ఎంఏలో బంగారు పతకాలు సాధించిన అన్విత్.. ప్రొఫెసర్ కావడమే తన లక్ష్యం అంటున్నాడు.

"నేను బీఏలో ఈ ఘనత సాధించడానికి అధ్యాపకులు, మిత్రులు చాలా సహాయం చేశారు. ఎంఏలో కూడా అదే సహకారం అందించారు. నాకు మెటీరియల్​ అవసరమైనపుడు ప్రొఫెసర్లు ఇచ్చేవారు. పరీక్షల సమయంలో ఇది ఎంతో సహాయం చేసింది."

-అన్విత్​ కుమార్, గోల్డ్​ మెడలిస్ట్​

75 Years Old Woman Done PHD: చదువుకు వయసు అడ్డు కాదని నిరూపించారు మంగళూరుకు చెందిన ఓ వృద్ధురాలు. ఉడుపికి చెందిన ఉషా చడగ 75 ఏళ్ల వయసులో మంగళూరు విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్​డీ పట్టా పొందారు. 'శ్రీ మధ్వాచార్యుల అద్వితీయమైన జీవస్వభావ వాదం, సర్వశబ్ద వాచ్యత్వానికి సంబంధించిన శ్రీ మధ్వాచార్యుల విశిష్ట సిద్ధాంతాల విమర్శనాత్మక విశ్లేషణ' అన్న అంశంపై ఆమె చేసిన పరిశోధనకు గాను డాక్టరేట్​ వరించింది.

 పీహెచ్​డీ పట్టాను అందుకుంటున్న ఉషా పట్టాతో ఉషా

ఉషా చడగ అంతకుముందు త్రివేండ్రంలోని సంతాన పబ్లిక్​ స్కూల్​లో ప్రిన్సిపాల్​గా పనిచేశారు. పదవీ విరమణ అనంతరం సంస్కృత కళాశాలలో చేరారు. సంస్కృత విద్వత్​ నేర్చుకున్న ఆమె.. పీహెచ్​డీ చేయాలని నిర్ణయించుకుని ఐదేళ్లలో పూర్తి చేశారు. మంగళూరు విశ్వవిద్యాలయంలో శనివారం జరిగిన 40వ స్నాతకోత్సవంలో ఉషా పట్టాను అందుకున్నారు.

0 Comments:

Post a Comment

Teachers INFO

  • SCERT - OFFICIAL - 10th class new pattern Model papers Latest
  • CLICK FOR MORE

Teachers News,Info

  • CCE Formative Assessment Tools and Guidelines for FA1, FA2, FA3, FA4 in AP Schools,FA Model papersLatest
  • CLICK FOR MORE
    Acadamic Reated Lables

District wise info

More
AP District wise updates

Pimary Classes TLM,Material

  • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
  • CLICK FOR MORE
    TLM For Primary Classes( 1 to 5th ) subject wise
    TLM For Class wise

High school -TLM,Material

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

General Issues

CLICK FOR MORE
General Lables

Students Related Info

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

AP District wise Updates

More
AP District wise updates

Technology

To get updates from aptnusinfo.blogspot.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top