Indian Army Recruitment 2022: టెన్త్ అర్హతతో ఇండియన్ ఆర్మీ గ్రూప్ సీ ఉద్యోగాలు.. నెలకు రూ.56,900ల జీతం..
Army Bihar Regimental Centre Group C Recruitment 2022: ఇండియన్ ఆర్మీకి చెందిన బీహార్ రెజిమెంటల్ సెంటర్ (BRC) గ్రూప్ సీ పోస్టు (group c posts)ల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..
వివరాలు:
మొత్తం పోస్టుల సంఖ్య: 12
పోస్టుల వివరాలు: గ్రూప్ సీ సివిలియన్ పోస్టులు
వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 18 నుంచి 25 ఏళ్‌ల మధ్య ఉండాలి.
పే స్కేల్: నెలకు రూ. 18,000ల నుంచి 56,900ల వరకు జీతంగా చెల్లిస్తారు.
అర్హతలు:
సఫాయివాలా పోస్టులకు పదో తరగతిలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
కుక్ పోస్టులకు పదో తరగతిలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే కుకింగ్‌లో నైపుణ్యం ఉండాలి.
వాషర్ మెన్ పోస్టులకు పదో తరగతిలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే మిలిటరీ దుస్తులను శుభ్రపరచడంలో నైపుణ్యం ఉండాలి.
బార్బర్ పోస్టులకు పదో తరగతిలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
కార్పెంటర్ పోస్టులకు పదో తరగతిలో ఉత్తీర్ణులై ఉండాలి. ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ లేదా నేషనల్ కౌన్సిల్ ఆఫ్ వొకేషనల్ ట్రైనింగ్ నుంచి కార్పెంటర్‌గా 3 సంవత్సరాల అనుభవం ఉండాలి.
ఎంపిక విధానం: స్కిల్ టెస్ట్, ట్రేడ్ టెస్ట్ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్దులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి
దరఖాస్తులకు చివరి తేదీ: మే 13, 2022.
0 Comments:
Post a Comment