తమకు నచ్చిన వారిని కౌగిలించుకుంటే వచ్చే ఆనందమే వేరు. ఆ కిక్కే వేరు. అవతలి వారిన ప్రేమతో హగ్ చేసుకుంటే తక్షణ మనలో ఆనందం కలుగుతుంది. మనసు ప్రశాంతంగా ఉంటుంది.
చాలా రిలాక్స్‌గా అనిపిస్తుంది. హగ్ (Hug) చేసుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు (health benefits) ఉంటాయట. దీని వల్ల శారీరకరంగా, మానసికంగా ప్రశాంతత ఉంటుందని చెబుతున్నారు.
ఆలింగనం (Hug) అనేది మానవ సంబంధాలలో అన్యోన్యతను సూచించే పద్ధతి. ఇది సాధారణంగా ఒకరిని మరొకరు చేతులతో చుట్టుకొని తెలియజేస్తారు.
ఇది మానవులలో ప్రేమ, అభిమానాన్ని చూపేందుకు ఎక్కువమంది ముద్దు (kiss) పెట్టుకోవడంతో సహా ప్రయోగిస్తారు.
చాలా దేశాలలో ఇది బహిరంగ ప్రదేశాలలో ఏ మాత్రం జంకు, భయం లేకుండా వారి కుటుంబ సభ్యులతోనే కాకుండా అన్ని మతాలలో, సంస్కృతులలో, అన్ని వయస్సుల వారు, స్త్రీ పురుషులు అతి సామాన్యంగా అభిమానాన్ని చూపే విధానం.
ఆనందాన్ని, సంతోషాన్ని మాత్రమే కాక, కౌగిలించుకోవడం (hug) కష్టాలలో వున్న వ్యక్తిని ఓదార్చడానికి, నేనున్నానని ధైర్యం చెబుతుంది. కొన్ని దేశాలలో కొత్త వ్యక్తిని కలిసేటప్పుడు కౌగిలితో పలకరిస్తారు.
కౌగిలించుకోవడం మనుషులలోనే కాకుండా కొన్ని జంతువులలో కూడా కనిపిస్తుంది. కౌగిలించుకోవడం ఆరోగ్యపరంగా (healthy) మంచిదట.
వ్యయ ప్రయాసలు అన్నీ దూరం..
ఒక పరిశోధనలో కౌగిలించుకోవడం వలన స్త్రీలలో ఆక్సిటోసిన్ విడుదలవుతుందని రక్తపోటు (BP) తగ్గుతుందని గుర్తించారు. అయితే హగ్ (hug) చేసుకుంటే ఆయుష్షు (Life time) కూడా పెరుగుతుందట.
దాని గురించి తెలుసుకుందాం.. చాలా మంది రోజంతా పనిచేస్తూనే ఉంటారు. అది శారీరకంగా కావొచ్చు.. మానసికంగా కావొచ్చు. దీని వల్ల త్వరగా అలసిపోతారు.
ఆ సమయంలో ఆలింగనం (hug) చేసుకుంటే చాలా వరకూ ఆ వ్యయ ప్రయాసలు అన్నీ దూరం అవుతాయని చెబుతున్నారు నిపుణులు.
ఎక్కువ కాలం బతుకుతారని..
ఒక్క హగ్‌తో ఎంతో రిలాక్స్ (relax) అవుతారని పరిశోధనలు చెబుతున్నాయి. మానసిక, శారీరక ఒత్తిడిలు అన్నీ కూడా ఒక్క కౌగిలింత (hug)తో దూరం అవుతాయని చెబుతున్నారు.
భార్య భర్తలు (husband and wife) కౌగిలించుకుంటారు.. అయితే.. నిత్యం ఇలా ఆలింగనం చేసుకోవడం వల్ల దంపతులు ఎక్కువ కాలం (many years) బతుకుతారని చెబుతున్నారు నిపుణులు. అంతేనా.. చూడటానికి కూడా ఎంతో యవ్వనంగా (young look) కనిపిస్తారని చెబుతున్నారు.
భార్య భర్తలు రోజుకు ఒకసారైనా తమ పార్టనర్‌ని ప్రేమతో హగ్ చేసుకోవాలని సూచిస్తున్నారు. ఈ ప్రక్రియ వల్ల వారి మధ్య సాన్నిహిత్యం మరింత పెరుగుతుందని చెబుతున్నారు.
ఎందుకలా..?
కౌగిలించుకున్నప్పుడు మనలో ఆక్సిటోసిన్, డోపమైన్, సెరోటోనిన్ అనే రసాయనాలు విడుదలవుతాయి. ఇవి మనలో రిలాక్స్‌ని పెంచుతాయి. దీంతో ఒక్కసారిగా మూడ్ మారిపోతుంది. డిప్రెషన్, ఒత్తిడిలు తగ్గిపోతాయంట. అలాగే హైబీపీ వంటి సమస్యలు కూడా తగ్గిపోతాయి.
ఇలా చేయడం వల్ల బాడీ పెయిన్స్, నొప్పులు కూడా దూరం అవుతాయని చెబుతున్నారు నిపుణులు. అదే విధంగా మనం ఎవరైనా కౌగిలించుకున్నప్పుడు మనలోని థైమస్ గ్రంథి ఉత్తేజానికి గురవుతుందట.
దీంతో మన శరీరంలోని తెల్ల రక్త కణాల సంఖ్య పెరుగుతుంది. అలాగే రోగ నిరోధక వ్యవస్థ పటిష్టమై వ్యాధులు రాకుండా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.
అందుకే అప్పుడప్పుడు తెలిసిన వారిని, స్నేహితులను హగ్ చేసుకోవడం చేస్తూ ఉండండి. అంతేగాని.. ఎవరినీ పడితే వారిని హగ్ చేసుకుంటే కష్టాలు పడాల్సి వస్తుంది.
0 Comments:
Post a Comment