నరేంద్ర మోదీ ప్రభుత్వం ఇటీవల కేంద్ర ఉద్యోగుల డియర్‌నెస్ అలవెన్స్‌ను పెంచింది.
డీఏ 3 శాతం పెరగడంతో మొత్తంగా 34 శాతానికి పెరిగింది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు త్వరలో మరో శుభవార్త చెప్పనున్నట్టు తెలుస్తోంది. దీంతో వారి జీతం మరింత పెరగొచ్చు.
మోదీ ప్రభుత్వం ఈ నెలలో ఉద్యోగులకు జీతాల పెంపు బహుమతిని ఇవ్వనుంది. డీఏ తర్వాత, ఇప్పుడు ప్రభుత్వం ఇంటి అద్దె భత్యం ఇతర అలవెన్సులను పెంచే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.
డీఏ పెంపు తర్వాత, హెచ్‌ఆర్‌ఏ పెరుగుతుందనే అంచనాలు కూడా పెరిగాయి. హెచ్‌ఆర్‌ఏను గతేడాది జూలైలో పెంచారు. ఆ తర్వాత డీఏను కూడా 25 శాతం నుంచి 28 శాతానికి పెంచారు. ఇప్పుడు డీఏను 34 శాతానికి పెంచినందున హెచ్‌ఆర్‌ఏను కూడా సవరించవచ్చు.
ప్రభుత్వ ఉద్యోగులకు హెచ్‌ఆర్‌ఏను వారు పనిచేసే నగరాన్ని బట్టి నిర్ణయించబడుతుంది. X, Y, Z నగరాలకు మూడు కేటగిరీలు ఉన్నాయి. X కేటగిరీ నగరాల్లో నివసిస్తున్న లేదా పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగుల HRA, DA మాదిరిగానే 3 శాతం పెరిగే అవకాశం ఉందని సమాచారం.
ప్రస్తుతం ఈ నగరాల్లోని ఉద్యోగులు ప్రాథమిక వేతనంలో 27 శాతం హెచ్‌ఆర్‌ఏ పొందుతున్నారు. Y కేటగిరీ నగరాలకు ఈ పెరుగుదల 2 శాతం వరకు ఉండే అవకాశం ఉంది. ఈ ప్రాంతాల్లో పనిచేసే ఉద్యోగులకు 18-20 శాతం హెచ్‌ఆర్‌ఏ లభిస్తుంది.
Z కేటగిరీ నగరాలకు 1 శాతం HRA పెంచవచ్చు. ప్రస్తుతానికి ఈ ప్రాంతాల్లో ఉండే ఉద్యోగులకు HRA 9-10 శాతం చొప్పున ఇవ్వబడుతుంది.
0 Comments:
Post a Comment