House Building Advance: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. హౌస్ బిల్డింగ్ అడ్వాన్స్ వడ్డీ రేటు తగ్గించిన కేంద్రం
సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ (Central Government Employees)కి కేంద్రం తీపి కబురు అందించింది. ఇళ్లు లేదా ఫ్లాట్‌ల నిర్మాణం లేదా కొనుగోలు కోసం తీసుకునే హౌస్ బిల్డింగ్ అడ్వాన్స్ (HBA)పై వడ్డీ రేటును తగ్గించింది.
2022-23 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు హౌస్ బిల్డింగ్ అడ్వాన్స్ వడ్డీ రేటు (Interest Rate)ని 7.9 నుంచి 7.1 శాతానికి తగ్గిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ఉద్యోగులు ఇప్పటినుంచి 7.1 శాతం వడ్డీ రేటుకే హౌస్ బిల్డింగ్ కోసం అడ్వాన్స్ తీసుకోవచ్చు. సాధారణంగా ప్రభుత్వం 10-సంవత్సరాల జీ-సెక్ ఈల్డ్ (G-Sec yield) ఆధారంగా హౌస్ బిల్డింగ్ అడ్వాన్స్ (HBA) వడ్డీ రేటును నిర్ణయిస్తుంది.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఏప్రిల్ 1, 2022 నుంచి మార్చి 31, 2023 వరకు తీసుకునే అడ్వాన్స్‌లపై వడ్డీ రేటును 7.1 శాతంగా గృహనిర్మాణ & పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (Ministry of Housing & Urban Affairs) నిర్ణయించింది. అంతకుముందు, 2021-22 ఆర్థిక సంవత్సరానికి, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు హౌస్ బిల్డింగ్ అడ్వాన్స్‌పై వడ్డీ రేటు అక్టోబర్ 1, 2020 నుంచి మార్చి 31, 2022 వరకు అంటే 18 నెలలకు 7.9 శాతం విధించారు.
హౌస్ బిల్డింగ్ అడ్వాన్స్ (HBA) పొందడం ద్వారా, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు తమ సొంత ఇంటిని నిర్మించుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి 34 నెలల బేసిక్ శాలరీకి సమానమైన మొత్తాన్ని అడ్వాన్స్ గా పొందొచ్చు. ఇలా గరిష్టంగా రూ.25 లక్షలు అడ్వాన్స్ గా తీసుకోవడం సాధ్యం అవుతుంది. లేదా ఇంటి ఖరీదు లేదా తిరిగి చెల్లించే సామర్థ్యం ప్రకారం మొత్తం, కొత్త నిర్మాణం/కొత్త ఇల్లు/ఫ్లాట్ కొనుగోలు కోసం ఏది తక్కువైతే దానికి అమౌంట్ చేసుకోవచ్చు. 7వ పే కమిషన్ హౌస్ బిల్డింగ్ అడ్వాన్స్ 2017 నియమాల సిఫార్సుల ప్రకారం, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ముందు చెప్పినట్టుగా ఇంటి నిర్మాణం కోసం డబ్బులు తీసుకోవచ్చు.
వాయిదా (Installment) పేమెంట్ డేట్ నుంచి హౌస్ బిల్డింగ్ అడ్వాన్స్ సింపుల్ ఇంట్రెస్ట్ రేట్ తో వస్తుంది. హౌస్ బిల్డింగ్ అడ్వాన్స్ నిబంధనల ప్రకారం, ప్రిన్సిపల్‌ను మొదటి పదిహేనేళ్లలో 180 నెలవారీ వాయిదాలలో తిరిగి చెల్లించాలి. ఆ తర్వాత వచ్చే ఐదేళ్లలో వడ్డీని 60 నెలవారీ వాయిదాలలో చెల్లించాలి. నిర్మాణం, కొత్త ఇల్లు లేదా ఫ్లాట్ కొనుగోలు కోసం తీసుకున్న బ్యాంకు రుణాలు తిరిగి చెల్లించడానికి హౌస్ బిల్డింగ్ అడ్వాన్స్ పొందవచ్చు. ఎవరైనా పర్మినెంట్ ఎంప్లాయ్ లేదా 5 ఏళ్ల కంటిన్యూ వర్క్ చేసిన తాత్కాలిక ఉద్యోగులందరూ కూడా ఇంటిని సొంతం చేసుకోవడానికి హౌస్ బిల్డింగ్ అడ్వాన్స్ పొందవచ్చు. ఈ పథకాన్ని 1 అక్టోబర్ 2020 నుంచి ప్రారంభించారు. ఈ కరోనా కాలంలో మినిస్టీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ హెచ్‌బీఏ వడ్డీ రేట్లను తగ్గించడంతో కేంద్ర ఉద్యోగులకు భారీ ఊరట లభించినట్లయింది.
0 Comments:
Post a Comment