Health: ఈ ఆహారంతో అధిక రక్తపోటు అదుపు..
ఉప్పుతో అధిక రక్తపోటు ముప్పు తప్పదు...మందులు వాడుతూనే శారీరక శ్రమ, సమపాళ్లలో ఆహారం తీసుకుంటే అధిక రక్తపోటును అదుపులోకి తీసుకొని రావచ్చని నిపుణులు పేర్కొంటున్నారు.
సోడియం ఉన్న ఆహారం తగ్గించి పొటాషియం ఉన్న ఆహారం ఎక్కువగా తీసుకోవాలి. అధికరక్తపోటును అదుపులో ఉంచే ఆహార నియమాల గురించి పోషకాహార నిపుణురాలు అంజలీదేవి పలు విషయాలు వెల్లడించారు.
* ఎక్కువ కొవ్వు పదార్థాలు తిని వ్యాయామం చేయకపోయినా రక్త నాళాలు గట్టి పడిపోతాయి.
* రక్తనాళాల్లో సాగే గుణం తగ్గిపోయినపుడు అధిక రక్తపోటు వస్తుంది. ఇది మనం తీసుకునే ఆహారంతోనే ఏర్పడుతుంది.
* ఉప్పును వయస్సు ఆధారంగా తీసుకోవాలి. రోజుకు 5 గ్రాముల కంటే ఎక్కువగా తీసుకోవద్దు. మధుమేహం, వయసు మళ్లిన వారున్న వారికి 3 గ్రాముల లోపే ఇవ్వాలి.
* మాంసం అధికంగా తింటే రక్తనాళాల్లో కొవ్వు పట్టేస్తుంది. నరాల స్థాయిని తగ్గిస్తుంది.
* పొటాషియం పుష్కలంగా లభించే బొప్పాయి, అరటి, మామిడి, కమల,కాకర, స్ట్రాబెర్రీ, మునగకాడ లాంటి వాటిని తరచుగా తీసుకోవాలి.
* అరటి, జామ, నేరేడు పండ్లకు బీపీని అదుపు చేసే గుణం ఉంది.
* రక్తపోటును తగ్గించడానికి వెల్లుల్లి బాగా సాయ పడుతుంది. రోజూ వారి వంటల్లో ఏదో ఒక రూపంలో వినియోగించాలి.
* వంటలకు అలీవ్, నువ్వుల నూనెను వాడుకోవాలి.
* ఉదయం లేవగానే బీట్‌రూట్ రసాన్ని తాగడంతో కూడా రక్తపోటు తగ్గే అవకాశం ఉంటుంది.
* టమాటలో లైకోపిన్ రసాయనం ఉంటుంది. దీనికి బీపీ తగ్గించే గుణం ఉంది. ప్రతిరోజు ఆహారంలో తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలి.
* నిత్యం గ్రీన్ టీ తాగడంతో బీపీ చక్కగా తగ్గుతుంది.
* రీఫైన్డ్ అయిల్ కాకుండా గానుగ పట్టే నూనెలు ప్రయోజనకరం. అవి ఖరీదు కావడంతో తక్కువగా వినియోగిస్తాం.
* వ్యాయామం చేయడంతో పాటు మానసిక ఒత్తిడి తగ్గించుకోవాలి.
* కాఫీ తక్కువగా తాగాలి.
0 Comments:
Post a Comment