Health Tips: వేరుశెనగలు ఎన్నో పోషక విలువలు కలిగి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. సాధారణంగా శీతాకాలంలో వేరుశెనగ గురించి తినడానికి చాలా మంది ఇష్టపడుతారు.
ఎక్కువగా వేయించిన వేరుశనగ పప్పు తినడం వల్ల అజీర్తి, ఎసిడిటీ వంటి జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. కానీ వేరుశెనగలు ఉడికించి తినటం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
వేరుశనగ పప్పులో పొటాషియం, కాపర్, కాల్షియం, మాంగనీస్, ఐరన్ పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వేరుశనగపప్పు వేసవికాలంలో నానబెట్టి తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.
ప్రతిరోజు ఉదయం గుప్పెడు నానబెట్టిన వేరుశనగ విత్తనాలు తినడం వల్ల ఎసిడిటీ, అజీర్తి వంటి సమస్యలు దరిచేరవు. నానబెట్టిన వేరుశెనగ విత్తనాలు తినడం వల్ల క్యాన్సర్ సమస్యలను కూడా అదుపులో ఉంచవచ్చు.
సాధారణంగా వేరుశనగ విత్తనాల లో ఐరన్ క్యాల్షియం ఎక్కువగా ఉండటం వల్ల శరీరంలో రక్తహీనత సమస్య నివారించవచ్చు.
అంతేకాకుండా ప్రతి రోజు వేరుశనగ విత్తనాలు తినడం వల్ల అందులో ఉండే కాల్షియం ఎముకలు దృఢంగా ఉండేలా చేస్తాయి.
ప్రతిరోజు ఉదయం నానబెట్టిన వేరుశనగ విత్తనాలు తినడం వల్ల శరీరంలో రక్తప్రసరణ సక్రమంగా జరిగి గుండె సంబంధిత సమస్యలు దరిచేరకుండా ఉంటాయి.
ముఖ్యంగా చిన్నపిల్లలు, గర్భవతులు వేరుశనగ విత్తనాలు, బెల్లం కలిపిన పల్లి చెక్క తినటం వల్ల రక్తహీనత సమస్య నుండి బయటపడవచ్చు.
0 Comments:
Post a Comment