Headmaster, teacher suspension
ప్రధానోపాధ్యాయిని, ఉపాధ్యాయుడి సస్పెన్షన్
ప్రధానోపాధ్యాయిని, ఉపాధ్యాయుడి సస్పెన్షన్
ప్రత్తిపాడు, న్యూస్టుడే: ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న గోరుముద్ద పథకం అమలులో అలసత్వం వహించిన ప్రధానోపాధ్యాయిని ఇంద్రావతి, ఉపాధ్యాయుడు వెంకటేశ్వరావును సస్పెండ్ చేస్తున్నట్లు డీఈవో గంగాభవాని పేర్కొన్నారు.
గత నెల 25న ప్రత్తిపాడులోని ప్రాథమిక పాఠశాల (హెచ్ఈ)ను ఎంఈవో సీహెచ్ రమాదేవి తనిఖీ చేశారు. ఆ సమయంలో పురుగులు పట్టిన ఆరు బియ్యం బస్తాలను గుర్తించారు. అప్పటికే ఆ బియ్యంతో మధ్యాహ్న భోజనం వండడంతో ఎంఈవో వంట ఏజెన్సీ నిర్వాహకురాలిపై మండిపడ్డారు. బియ్యం గతేడాది డిసెంబరు నెలలో ఇచ్చినవని, పురుగులున్న విషయాన్ని ప్రధానోపాధ్యాయిని ఇంద్రావతి దృష్టికి తెచ్చినా పట్టించుకోలేదని ఏజెన్సీ నిర్వాహకురాలు తెలిపారు. తాము బియ్యాన్ని ఉప్పుతో శుభ్రంగా కడిగి అన్నం వండుతున్నట్లు చెప్పారు. ఆ సమయంలో ప్రధానోపాధ్యాయురాలు సెలవులో ఉండడంతో ఎంఈవో ఇన్ఛార్జి ఉపాధ్యాయుడు వెంకటేశ్వరరావు దీనిపై ప్రశ్నించారు. ఆయన చిక్కీలు కూడా బూజు పట్టినవి వస్తున్నాయని సమాధానం ఇచ్చారు. దీనిపై పత్రికల్లో వార్తలు రావడంతో జేసీ రాజకుమారి ఆదేశాల మేరకు మధ్యాహ్న భోజన ఏడీ శ్రీనివాసరావు విచారణ చేపట్టారు. ప్రధానోపాధ్యాయిని ఇంద్రావతి, ఉపాధ్యాయుల వివరణ తీసుకున్న ఏడీ నివేదికను జేసీకి అందించారు.
0 Comments:
Post a Comment