Gold: మనలో చాలామంది పెళ్లిళ్ల సమయంలో, శుభకార్యాల సమయంలో బంగారం కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతుంటారు.
అవసరమైతే కొన్ని సందర్భాల్లో ధరతో సంబంధం లేకుండా బంగారం కొనుగోలు చేయాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి.
అయితే బంగారం కొనుగోలు చేసేవాళ్లు కొన్ని తప్పులను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదు. బంగారం కొనుగోలు చేసేముందు నగలపై హాల్ మార్క్ గుర్తును పరిశీలించాలి.
బంగారంపై ఉండే ఈ హాల్ మార్క్ బంగారం స్వచ్చతను సూచిస్తుందని చెప్పవచ్చు. ఈ హాల్ మార్క్ ద్వారా బంగారం యొక్క ప్యూరిటీని సులభంగా తెలుసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది.
బంగారం కొనుగోలు చేసిన సమయంలో పూర్తిగా బంగారంతో తయారు చేసిన నగలను కొనుగోలు చేస్తే మంచిదని చెప్పవచ్చు.
పూర్తిగా బంగారంతో చేసిన నగలను కొనుగోలు చేయడం వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉండవు.
బంగారం కొనుగోలు చేసే సమయంలో అందులో రాళ్లు ఉంటే రాళ్లకు వేరుగా విలువ కట్టాలని వ్యాపారులకు సూచించాలి. రాళ్లకు అసలు విలువ ఉండదని పగడాలు, కెంపులకు మాత్రమే రీసేల్ వాల్యూ ఉంటుందని గుర్తు పెట్టుకోవాలి.
బంగారం కొనుగోలు చేసే సమయంలో కంప్యూటర్ బిల్లు లేదా ఇన్ వాయిస్ బిల్లు తీసుకోవాలి. బంగారం విషయంలో ఏమైనా మోసాలు జరిగితే ఈ బిల్లు ద్వారా బెనిఫిట్ కలుగుతుంది.
బంగారంను నాణేలు, కడ్డీల రూపంలో కొనుగోలు చేయవచ్చు. ఇలా కొనుగోలు చేయడం వల్ల నాణ్యతకు సంబంధించి పూర్తిస్థాయిలో హామీ ఉంటుంది.
బ్యాంకులు సైతం వీటిని విక్రయిస్తుండటం గమనార్హం. వాయిదాల పద్ధతి ద్వారా బంగారం కొనుగోలు చేసేవాళ్లు నమ్మకమైన సంస్థలను ఎంచుకోవాలి.
పెద్దపెద్ద దుకాణాలలో బంగారం కొనుగోలు చేసేవాళ్లు తరుగు, మజూరీపై అవగాహన కలిగి ఉండాలి.
0 Comments:
Post a Comment