Devotional Tips: మన హిందూ సాంప్రదాయాల ప్రకారం ప్రతి ఒక్కరూ ప్రతిరోజూ ఉదయం లేదా సాయంత్రం ఆలయానికి వెళ్లి భగవంతుడిని దర్శించుకుని రావడం అలవాటుగా ఉంటుంది.
ఈ క్రమంలోనే ఎంతో మంది భక్తులు నిత్యం ఆలయాలకి వెళుతూ స్వామివారి దర్శన భాగ్యం చేసుకుంటారు. అయితే చాలామంది తెలిసీ తెలియక ఆలయానికి వెళ్లేటప్పుడు కొన్ని పొరపాట్లు తప్పులు చేస్తుంటారు.
ఇలా తెలిసి తెలియక ఈ తప్పులు చేయటం వల్ల మనకు ఆ భగవంతుడి దర్శనభాగ్యంలో ఎలాంటి ఫలితం ఉండదని పండితులు చెబుతున్నారు.
అందుకే ఆలయానికి వెళ్ళినప్పుడు పొరపాటున కూడా కొన్ని తప్పులను చేయకూడదని పండితులు తెలియజేస్తున్నారు. మరి ఆ తప్పు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం…
Devotional Tips
సాధారణంగా స్త్రీలు పురుషులు ఆలయానికి వెళ్ళేటప్పుడు కొన్ని నియమాలను పాటించాలి. ముఖ్యంగా ఆలయానికి వెళ్లే సమయంలో స్త్రీ పురుషులు ఇద్దరూ సాంప్రదాయమైన దుస్తులను ధరించాలి.
అయితే ఈ మధ్య కాలంలో మహిళలు పాశ్చాత్య సంస్కృతికి అలవాటు పడి దుస్తులను ధరించడం అలాగే జుట్టు విరబోసుకుని వెళ్లడం చేస్తుంటారు.
పొరపాటున కూడా జుట్టు విరబోసుకుని ఆలయానికి వెల్ల కూడదు చక్కగా జడ వేసుకొని ఆలయానికి వెళ్లాలి.
అదే విధంగా ఆలయంలోకి వెళ్ళిన తర్వాత ముందుగా క్షేత్రపాలకుడుని దర్శనం చేసుకున్న అనంతరం గర్భగుడిలో స్వామివారిని దర్శనం చేసుకోవాలి.
ఇక ఆలయంలో ప్రదక్షిణలు చేసేవారు ఆలయం ముందున్న ధ్వజస్తంభానికి ప్రదక్షిణలు చేయాలి. అలాగే ధ్వజస్తంభం కుడి వైపు నుంచి ఆలయంలోకి ప్రవేశించి ఎడమ వైపు నుంచి బయటకు రావాలి.
ఇకఆలయానికి వెళ్లిన తర్వాత కేవలం మనం ఆలయంలో ఉన్నటువంటి స్వామి వారిని మాత్రమే నమస్కరించాలి ఇక పండితులను కూడా మనం నమస్కరించకూడదు.
స్వామివారిని దర్శనం చేసుకొని పండితులకు నమస్కరించడం వల్ల స్వామి వారి దర్శన ఫలితం మనపై ఉండదు.
ఇక పూజ చేస్తున్న సమయంలో స్వామి వారికి సమర్పించాల్సిన పండ్లు ఫలహారాలు సమర్పించిన తర్వాత మనం ఒక వైపు నిలబడి ఉండాలి.
పూజ చేస్తున్న సమయంలో స్వామివారికి ద్వార పాలకుడికి అడ్డుగా నిలబడదు. ఇలా ఆలయానికి వెళ్ళినప్పుడు ఈ పొరపాట్లు జరగకుండా చూసుకోవడం ఎంతో ముఖ్యం.
0 Comments:
Post a Comment