సినిమా టిక్కెట్ల ధరలను ప్రభుత్వం నిర్ణయించేందుకు వీల్లేదు : హైకోర్టు
సినిమా టిక్కెట్ల ధరలను ప్రభుత్వం నిర్ణయించేందుకు వీల్లేదని హైకోర్టు స్పష్టం చేసింది. టిక్కెట్ల రేట్లను, సర్వీస్ ఛార్జీలను నిర్ణయించే అధికారం లైసెన్సింగ్ అథార్టీ అయిన జాయింట్ కలెక్టరుకు మాత్రమే ఉంటుందని చెప్పింది.
ఆన్లైన్లో అమ్మే టిక్కెట్ల ధరలో సర్వీస్ ఛార్జీలు కలిపి వసూలు చేయడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. పాత విధానంలో ఆన్లైన్ టిక్కెట్లు అమ్ముకోవచ్చునని స్పష్టం చేసింది. ఆన్లైన్ ద్వారా టిక్కెట్లను కొనేవారిపై సర్వీస్ ఛార్జీల భారం వేయవచ్చునని చెప్పింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ డివిఎస్ఎస్ సోమయాజులు బుధవారం మధ్యంతర ఉత్తర్వులిచ్చారు. టిక్కెట్ల రేట్ల జిఓను, టిక్కెట్లలో సర్వీస్ ఛార్జీలను కలిపి ఆన్లైన్ టిక్కెట్లను నిర్ణయించడాన్ని సవాల్ చేసిన కేసులో హైకోర్టు మధ్యంతర ఆదేశాలిచ్చింది. జిఓ 69 ప్రకారం లైసెన్సింగ్ అథార్టీనే టిక్కెట్ల ధరల్ని నిర్ణయించాలని చెప్పింది.
0 Comments:
Post a Comment