మీరు మీ జీవితంలో డబ్బు కోసం ఇబ్బందులు పడకూడదనుకుంటే ఆచార్య చాణక్య తెలిపిన ఈ విషయాలను గుర్తుంచుకోండి. ఆర్థికవేత్త అయిన ఆచార్య చాణక్యుడు చాణక్య నీతి శాస్త్రంలో తన జీవితంలోని అనేక అనుభవాలను లోతుగా వివరించారు.
జీవితంలో ఎంతో కీలకమైన డబ్బుకు సంబంధించిన విషయాలపై శ్రద్ధ వహించాలని ఆచార్య చాణక్య తెలిపారు. చాణక్య నీతి ప్రకారం డబ్బు కష్టాలను నివారించడానికి మనం ఏ విధంగా మెలగాలో ఇప్పుడు తెలుసుకుందాం.
1. చాణక్య నీతి ప్రకారం శత్రువుల ఉపకారంతో పొందిన సొమ్ము, లేదా నైతిక విలువలు వదిలేయడం ద్వారా వచ్చే సొమ్ము కోసం ఎప్పటికీ పరుగెత్తకూడదు. ఎందుకంటే అలాంటి సొమ్ము ఎక్కువ కాలం నిలువదు. ఇటువంటి సొమ్ము సమస్యలను సృష్టిస్తుంది.
2. దానధర్మాలను నెరవేర్చడంలో ఉన్న ప్రాముఖ్యత గురించి గ్రంథాలలో తెలియజేశారు. చాణక్య నీతిలో తెలిపిన వివరాల ప్రకారం మనిషి తన సామర్థ్యాన్ని అనుసరించి దానధర్మాలు చేయాలి. అయితే పరిమితికి మించి విరాళాలు ఇవ్వడం వల్ల ఆర్థిక సంక్షోభం ఏర్పడుతుంది.
3. జీవితంలో ఆనందం, శ్రేయస్సును అందుకునేందుకు, డబ్బు కష్టాలను నివారించడానికి మనిషి ఒక లక్ష్యాన్ని ఏర్పరుచుకోవాలి. ఎందుకంటే సరైన ప్రణాళిక లేకుండా, లక్ష్యం లేకుండా ముందుకు సాగే మనిషి జీవితంలో ఎన్నో కష్టాలను ఎదుర్కోవలసి వస్తుంది.
4. చాణక్య నీతి ప్రకారం జీవితంలో డబ్బు సంపాదించిన తర్వాత దానిని పొదుపు చేయకపోతే, కష్టకాలం రావడానికి ఎంతో సమయం పట్టదు. తరువాత డబ్బు కోసం ఇతరుల ముందు చేతులు చాచాల్సి రావచ్చు. అవసరాలను అనుగుణంగా డబ్బు ఖర్చు చేయడంతో పాటు భవిష్యత్తు కోసం డబ్బును పొదుపు చేయడం చాలా ముఖ్యం.
5. ఆచార్య చాణక్య తెలిపిన వివరాల ప్రకారం మనిషి.. గౌరవం, ఉద్యోగం, విద్య, వ్యాపారం లేనిచోట అలాగే తెలివైన వ్యక్తులు లేనిచోట నివసించకూడదు. ఎందుకంటే అలాంటి చోట డబ్బు సంపాదించడం ఎంతో కష్టం.
0 Comments:
Post a Comment