🔳పేషీల్లో ఉద్యోగులకు ఝలక్...
అందరూ మాతృ శాఖలకే!!.. ఒకట్రెండు రోజుల్లో ఉత్తర్వులు
రాష్ట్ర కొత్త మంత్రివర్గం 11న ప్రమాణం చేయనున్న నేపథ్యంలో ప్రస్తుత మంత్రుల పేషీల్లో విధులు నిర్వర్తిస్తున్న సిబ్బందికి ప్రభుత్వం గట్టి ఝలక్ ఇవ్వనుంది. ఓఎ్సడీలు, పీఏలు, పీఎ్సలు, అదనపు వ్యక్తిగత కార్యదర్శులందరినీ మాతృశాఖలకు పంపే ఆదేశాలను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. సంబంధిత ఉత్తర్వులు ఒకట్రెండు రోజుల్లో వెలువడే అవకాశం ఉంది. మళ్లీ కొత్త మంత్రివర్గం ఏర్పడిన తర్వాత ఆయా మంత్రులు తమకు అనుకూలరైన ఉద్యోగులను మళ్లీ తమ పేషీల్లోకి తీసుకొచ్చుకునే అవకాశం ఉంది. తమకు ఇష్టమైతే పాత మంత్రుల వద్ద పని చేసినవారిని కొనసాగించుకోవచ్చు. ఉద్యోగులు సొంత శాఖలకు వెళ్లాక కొత్త మంత్రులు వారిని తమ పేషీలకు ఎంచుకోవచ్చని అధికార వర్గాలు చెబుతున్నాయి.
0 Comments:
Post a Comment