✍️గతేడాది నిబంధనలతోనే అమ్మ ఒడి
♦ఆధార్‌లో కొత్త జిల్లా అవసరం లేదు
♦డీఈవో గంగాభవాని స్పష్టీకరణ
*🌻ఏలూరు ఎడ్యుకేషన్, ఏప్రిల్ 21 :* అమ్మఒడి ఆర్థిక సాయం పథకానికి ఎంపికవడానికి ఆధార్ కార్డులో కొత్త జిల్లా పేరు మార్చుకోవాల్సిన అవసరం లేదని, అటువంటి నిబంధనను ప్రభుత్వం ఏదీ పెట్టలేదని డీఈవో ఆర్.ఎస్.గంగాభవాని స్పష్టం చేశారు. అమ్మ ఒడి పథకానికి అర్హతలపై ప్రభుత్వం గతంలో నిర్దేశించిన షరతులు, నిబంధనలే ఈ ఏడాది కూడా కొనసాగుతాయని, ఆ మేరకు కొత్తగా ఆంక్షలు పెట్టారన్న ప్రచారంలో వాస్తవం లేదని వివరించారు. గురు వారం డీఈవో గంగాభవాని మాట్లాడుతూ అమ్మఒడి పథకానికి అర్హత సాధించిన విద్యార్థి తల్లి బ్యాంకు ఖాతాకు ఆధార్‌ను, ఫోన్‌నెంబర్‌ను ఇప్పటికే లింక్ చేయించుకుని ఉంటే తాజాగా చేయించుకోవాల్సిన అవసరం లేదన్నారు. హౌస్ హోల్డ్ మ్యాపింగ్‌లో తల్లి, విద్యార్థి ఒకే మ్యాపింగ్‌లో ఉండాలని, విద్యార్థి వయస్సు, జెండర్ వివరాలు సరిగాలేకపోతే గ్రామ/వార్డు వలంటీరు వద్ద ఈకెవైసీ చేయించుకుంటే అప్‌డేట్ అవుతుందన్నారు. అమ్మఒడి ప్రక్రియ ఇంకా ప్రాథమిక స్థాయిలోనే ఉందన్నారు. విద్యార్థికి 75 శాతం హాజరు, రైస్‌కార్డు, కుటుంబంలో మెట్ట భూమి పది ఎకరా లలోపు, మాగాణి మూడు ఎకరాలలోపు ఉండాలన్నారు. ఆదాయపు పన్ను చెల్లింపుదారై ఉండరాదని వివరించారు. కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగి ఉండరాదని తెలిపారు. నెలవారి విద్యుత్ వినియోగం 300 యూనిట్లు మించకూడదన్నారు. పట్టణ ప్రాంతంలో నివాస స్థలం వెయ్యి చదరపు అడుగులు మించ కూడదని, టాక్సీ/ట్రాక్టర్ మినహా నాలుగు చక్రాల వాహనం కలిగి ఉండకూడదని వివరించారు.
0 Comments:
Post a Comment