తేలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం గండుగులపల్లి ఏకలవ్య రెసిడెన్షియల్ స్కూల్ ప్రిన్సిపల్ పూనెం వీరస్వామి డిప్యుటేషన్ పై బదిలీ అయ్యారు.
ఆయన ఏప్రిల్ 8న రిలీవై బయల్దేరుతుండగా విద్యార్థినులు విలపించారు. 'మీరే మా సార్.. ఎక్కడికి వెళ్లకండి.. మమ్మల్ని కన్నబిడ్డల్లా చూసుకున్న మీరు లేకపోతే ఉండలేం' అంటూ వేడుకున్నారు. విద్యార్థినుల అభిమానం, ఆప్యాయతకు ప్రిన్సిపాల్ కూడా భావోద్వేగానికి గురై కంటతడి పెట్టుకున్నారు. బదిలీపై పాల్వంచకు వెళ్తున్న ఆర్చరీ కోచ్ హేమను చూసి కూడా విద్యార్థినులు కన్నీటి పర్యంతమయ్యారు.
0 Comments:
Post a Comment